అడ్డంగా దొరికిన స‌జ్జ‌ల‌.. క్రైస్త‌వ సంఘాలు ఆగ్ర‌హం

Publish Date:Oct 2, 2024

Advertisement

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి క‌లిసింద‌ని ల్యాబ్‌ రిపోర్టులు రావ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. వైసీపీ హ‌యాంలో త‌క్కువ ధ‌ర‌కు నెయ్యిని కొనుగోలు చేసి ల‌డ్డూ త‌యారీకి  వినియోగించారు. దీంతో తిరుమ‌ల ద‌ర్శ‌నం చేసుకున్న చాలా మంది భ‌క్తులు గ‌తంలో ల‌డ్డూ క్వాలిటీ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ల‌డ్డూ క్వాలిటీగా ఎందుకు లేద‌నే అంశంపై అధికారులు దృష్టిసారించారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. క్వాలిటీ త‌క్కువ నెయ్యి వాడుతున్నార‌ని తేల‌డంతో పాటు.. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లుస్తున్న‌ట్లు ల్యాబ్ రిపోర్టుల్లో తేలింది. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై హిందువు సంఘాలు, హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ బ్యాచ్ మాత్రం త‌ప్పును ఒప్పుకొని దేవుడిని క్ష‌మాప‌ణ‌లు కోర‌కుండా.. ల్యాబ్ రిపోర్టులు అబ‌ద్ద‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్రం అనుమ‌తితో నిర్వ‌హిస్తున్న ల్యాబ్ రిపోర్టుల‌ను చంద్ర‌బాబు ఇంటిలో త‌యారు చేసిన రిపోర్టులు అంటూ జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ ప‌దేప‌దే ప్రెస్ మీట్లు పెట్టి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం ఈ అంశం కాస్త కోర్టుకు చేరింది. 

ల‌డ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. మంగ‌ళ‌వారం(అక్టోబర్1) దేశ అత్యన్నత న్యాయస్థానం విచార‌ణ జ‌రిపింది. అయితే, ఈ విచార‌ణ‌లో న్యాయస్థానం రాష్ట ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ఓ ప్రశ్న సంధించారు.  ఏ విధమైన ఆధారాలు లేకుండా, సిట్ రిపోర్ట్ రాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి ల‌డ్డూ క‌ల్తీ జ‌రిగింద‌ని ఎలా చెప్తారు..? అన్న‌దే ప్ర‌శ్న‌. దీన్నే ఆయుధంగా మార్చుకున్న‌ వైసీపీ డ్రామా షురూ చేసింది. అస‌లు కోర్టులో ఏం జ‌రిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే.. భక్తులకు, కోట్లాది హిందువులకు అబద్ధపు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వానికి సుప్రీం చివాట్లు పెట్టింద‌ని,  దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మొట్టికాయ‌లు వేసింద‌ని వైసీపీ ముఖ్య నేత‌లు తెగ హ‌డావుడి చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేయాలంటూ వైసీపీ నేత‌లు చెత్త డిమాండ్లు చేస్తున్నారు. 

వాస్త‌వంగా.. సుప్రీం కోర్టు ఏపీ ప్ర‌భుత్వాన్ని త‌ప్పు పట్ట‌లేదు. కేవ‌లం ల‌డ్డూ క‌ల్తీ అయింద‌నే విష‌యంపై పూర్తి ఆధారాలు లేకుండానే ఎందుకు మాట్లాడార‌ని ప్ర‌శ్నించింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి మీడియా ముందుకు రాని సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. తాజాగా క‌ల్తీ ల‌డ్డూ వివాదంపై మీడియాతో మాట్లాడారు. ఆ మీడియా స‌మావేశం లైవ్ అనుకుంటే పొర‌పాటే. రికార్డు చేసిన వీడియోను మీడియాకు విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలో స‌జ్జ‌ల అడ్డంగా దొరికిపోయారు. 

మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌య‌ప‌డుతున్నారు. తిరుప‌తి ల‌డ్డూ విష‌యంపై మొన్న జ‌గ‌న్ ప్రెస్ మీట్ పెట్టిన స‌మ‌యంలోనూ విలేక‌రులు కెమెరాలు ప‌ట్టుకొని రావొద్దు.. ప్ర‌శ్న‌లు అడిగేందుకు రండి. మేమే మీకు రికార్డు చేసి వీడియోను పంపిస్తాం అంటూ వైసీపీ కార్యాల‌యం సూచించిన‌ట్లు తెలుస్తోంది. రెండురోజుల క్రితం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తిరుమ‌ల ల‌డ్డూ వివాదంపై విలేక‌రుల స‌మావేశం పెట్టి మాట్లాడాడు. వాళ్ల సొంత గదిలో సొంత వీడియో రికార్డులో పెట్టుకున్నారు. ఇక్క‌డే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఆయ‌న వెనుకాల అల్మారాలో మూడు   శిలువలు ఉన్నాయి. ఈ శిలువ‌లు లైవ్ జ‌రుగుతుండ‌గానే గుట్టుచ‌ప్పుడు కాకుండా ప‌క్క‌కు తీశారు. అంటే.. స‌జ్జ‌ల మీడియా స‌మావేశం ప్రారంభంలో ఆయ‌న వెనుకాల అల్మారాలో శిలువ గుర్తులు ఉన్నాయి. కెమెరా స‌జ్జ‌ల‌ను జూమ్ తీసుకొని.. మ‌ళ్లీ య‌థాస్థితికి వ‌చ్చే స‌రికి వెనుకాల అల్మారాలో శిలువ గుర్తులు క‌నిపించ‌కుండా పోయాయి. ఎందుకు సజ్జ‌ల అనుచ‌రులు వాటిని తొల‌గించారంటే.. మాట్లాడేది తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం గురించి.. ఆయ‌న వెనుకాల శిలువ గుర్తులు ఉంటే ఎవ‌రైనా హిందువులు ఆయ‌న మాట‌ల‌ను విశ్వ‌సించ‌రు.అన్న భయంతోనే. దీంతో మీడియా స‌మావేశం స‌గం పూర్త‌యిన త‌రువాత ఆయ‌న  అనుచ‌రులు ఆ శిలువ గుర్తుల‌ను తొల‌గించారు. దీంతో ప‌లు క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులు స‌జ్జ‌ల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 వాస్త‌వానికి స‌జ్జ‌ల మీడియా స‌మావేశం మ‌ధ్య‌లో ఆయ‌న వెనుకాల ఉన్న శిలువ గుర్తుల‌ను తీయ‌మ‌ని ఎవ‌రూ అడ‌గ‌లేదు. కానీ, వాటిని తొల‌గించ‌డం ప‌ట్ల  క్రైస్త‌వులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ఇలాంటి ప‌నులు చేసిన స‌జ్జ‌ల, వైసీపీ నేత‌లు తిరుప‌తి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి క‌ల‌వ‌డానికి కార‌కులు కాలేద‌ని ఎలా అనుమానించ‌కుండా ఉండ‌గ‌ల‌మ‌ని  హిందువులు, స్వామివారి భ‌క్తులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి అంశం వైసీపీ శ్రేణుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే త‌రుణంలో వైసీపీ నేత‌లు అడ్డంగా దొరికిపోతున్నారు.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.