పిల్ల సజ్జలకు ఉద్వాసన! సోషల్ మీడియా బాధ్యతల నుంచి ఔట్!

Publish Date:Jun 20, 2024

Advertisement

వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా జగన్ పిల్ల సజ్జల ( అదే సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి)కు ఉద్వాసన చెప్పేశారా? సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇక మీడియా ముందుకు రావద్దు సమావేశాలకు వచ్చి బుద్ధిగా చెతులు కట్టుకుని కూర్చుని వెళ్లి పోతే చాలు అని ఆంక్షలు విధించారా? పార్టీ అధికారికంగా ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు కానీ, సజ్జల, పిల్ల సజ్జలల సీన్ వైసీపీలో అయిపోయిందన్న చర్చ మాత్రం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలకు పిల్ల సజ్జలను దూరంగా ఉంచారని సోదాహరణంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పిల్ల సజ్జల వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా ఉన్న సమయంలో తెలుగుదేశం నేతలు, ముఖ్యొంగా మహిళా నేతలపై అనుచిత పోస్టింగ్ లు కుప్పతెప్పలుగా ఉండేవి. వీటిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఆ ఫిర్యాదులను స్వీకరించని పరిస్థితి ఉండేది. అయితే ఇప్పడు వైసీపీ అధికారంలో లేదు.  వైసీపీ సోషల్ మీడియా అనుచిత పోస్టుల బాధితురాలు వంగలపూడి అనిత ఇప్పుడు హోం మినిస్టర్. దీంతో గతంలో  వైసీపీ సామాజిక మాధ్యమంలో అనుచితంగా, అసభ్యంగా పెట్టిన పోస్టుల కారణంగా ఇబ్బందులు పడిన వారు, బాధలు పడిన వారు ఇప్పుడు ఫిర్యాదులు చేయడానికి  ముందుకు వస్తున్నారు.  పార్టీ పరాజయం పాలు కాగానే సజ్జల భార్గవ వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం వేసి అజ్ణాతంలోకి వెళ్లి పోయారు. ఆయన తండ్రి సజ్జల కూడా కొన్ని రోజులు ఎవరికీ వినిపించకుండా, కనిపించకుండా ముఖం చాటేసినప్పటికీ.. ఇటీవల జగన్ నిర్వహించే సమావేశాలకు హాజరై మౌనంగా ఓ మూలన కూర్చుంటున్నారు.

ఒక దశలో తండ్రీ కొడుకులు అజ్ణాతంలోకి వెళ్లి పోయారనీ, వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ ఉన్నాయనీ పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపించింది. సోషల్ మీడియా, పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయనీ, దీనిపై జగన్ ఆగ్రహంగా ఉన్నారనీ, వారి గురించి వాకబు చేస్తున్నారనీ కూడా పార్టీ వర్గాలు చర్చించుకున్న పరిస్థితి. సరే ఇప్పుడు సజ్జల జగన్  భేటీలలో కనిపిస్తున్నా పిల్ల సజ్జల  మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.  పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జ్ అయిన సజ్జల భార్గవరెడ్డి అజ్ణాతంలోకి వెళ్లడంపై పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పిల్ల సజ్జలకు పార్టీ సోషల్ మీడియా వింగ్ అధిపతి పోస్టు నుంచి జగన్ ఉద్వాసన పలికారనీ,   భార్గవ నేతృత్వంలో  పార్టీ సోషల్ మీడియా అతి కారణంగానే వైసీపీ ఓటమికి కారణాలలో ఒకటిగా జగన్ భావిస్తుండటంతో ఆయనపై ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద పిల్ల సజ్జల సీన్ సితార అయినట్లేనని అంటున్నారు.  

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.