దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి. అంతేనా కబ్జాలు, దౌర్జన్యాలు, హత్యల కేసులలో కూడా వైసీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వైసీపీలో ఉండేందుకు నేరాలు చేయడం ఒక అర్హత అని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. అది పక్కన పెడితే తాజాగా తాజాగా మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేసే వారికి లంచాలు ఆఫర్ చేసి క్లీన్ సర్టిఫికెట్లు ఇప్పించే బృందం ఇటీవల సీబీఐకి పట్టుబడింది. ఆ నేర బృందంలోనూ ఓ వైసీపీ నేత పాత్ర కీలకంగా ఉంది. అంతే కాదు.. సదరు వ్యక్తి వైసీపీలో దాదాపు నంబర్ 2గా వెలిగిపోతున్న ఆ పార్టీ సీనియర్, కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడనీ చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల ఇన్ స్పెక్షన్లలో ముడుపుల దందా చ చేసిన కేసులో సీబీఐ 34 మందిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, జాతీయ మెడికల్ కమిషన్ తనిఖీ బృందం డాక్టర్లు, పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రతినిథులు ఉన్నారు. ఈ కేసులో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించినది వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ అని సీబీఐ పేర్కొంది. కదిరి సమీపంలోని ఆయన నివాసంలో ఇటీవల సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది.
ఇంతకీ ఆయన మధ్యవర్తిత్వం ఏమిటయ్యా అంటే.. మెడికల్ కాలేజీల్లో వసతులు లేకపోయినా, తగినంతమంది బోధనా సిబ్బంది లేకపోయినా.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీ బృందాలకు ముడుపులు ముట్టచెప్పి క్లీన్ సర్టిఫికెట్, అనుమతులు ఇప్పించడం. చెన్నైలో స్థిరపడిన ఈయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల తనిఖీలకు వచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిథులకు ఆయా కాలేజీలకు మధ్యవర్తిత్వం నెరపి ముడుపుల దందా సాగించారు. దీంతో వందల కోట్ల రూపాయల ఆస్తులనూ పోగేశారు. ఈ బత్తల హరిప్రసాద్ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గత ఎన్నికలలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. అయితే టికెట్ దక్కలేదనుకోండి అది వేరు సంగతి. ఇప్పుడా బత్తల హరిప్రసాద్ మెడికల్ కాలేజీల ముడుపుల యవ్వారంలో సీబీఐ నజర్ లో ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-aide-kingpin-in-medical-scam-39-201422.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.