జగన్ పార్టీ ముద్దు.. జగనే వద్దు!

Publish Date:Feb 13, 2025

Advertisement

ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి ఆరు రోజులయ్యిందో లేదో.. జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ పగ్గాలు విజయమ్మకు అప్పగించాలంటూ జగన్ గాలి తీసేశారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకే తాను వైసీపీలో చేరానని చెప్పిన శైలజానాథ్, ఆ లక్ష్యం నెరవేరాలంటే వైసీపీ పగ్గాలు జగన్ చేతిలో కాదు విజయమ్మ చేతిలో ఉండాలని అన్నారు.

తాను వైఎస్సార్ కు వీరాభిమానినని చెప్పుకున్న ఆయన.. జగన్ భావాలు, ఆలోచనలు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నందునే తాను కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరానన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పగ్గాలను జగన్ నుంచి విజయమ్మ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.  శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి కేవలం ఆరు రోజులే అయ్యింది. ఇంతలోనే ఆయన జగన్ నాయకత్వంపై అపనమ్మకాన్ని, అయిష్టతను వ్యక్తం చేసి విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అనడం వైసీపీలో సంచలనం సృష్టించింది. జగన్ సీటు కింద శైలజానాథ్ బాంబు పెట్టారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.  

పార్టీ పగ్గాలు విజయమ్మకు అప్పగిస్తే   పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరతారన్న సంకేతాలను శైలజానాథ్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు.  వైఎస్సార్ కు రాష్ట్రంలో అసంఖ్యాక అభిమానులు ఉన్నారనీ, వారంతా కూడా ఆయన కుటుంబంలో ఆస్తుల తగాదా పట్ల తీవ్ర ఆవేదనతో ఉన్నారని చెప్పిన శైలజానాథ్.. వైఎస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేశారు.  అదే సమయంలో విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ తో జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ ఓకే కానీ జగన్ నాయకత్వం మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పకనే చెప్పారు. అది కూడా విజయమ్మ  తన కుమారుడు, కోడలు అబద్ధాలు చెబుతున్నారంటూ బహిరంగంగా చెప్పిన రెండు రోజులకే పార్టీ నాయకత్వం విజయమ్మకు ఇస్తేనే వైపీపీ బలోపేతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

సరస్వతి పవర్ వాటాల విషయంలో జగన్, భారతి అబద్ధాలు చెప్పారని విజయమ్మ కుండబద్దలు కొట్టిన తరుణంలో శైలజానాథ్ వైసీపీ పగ్గాలను విజయమ్మకు అప్పగించాలడం సంచలనం సృష్టించింది. శైలజానాథ్ వ్యాఖ్యల పట్ల వైసీపీలో కూడా సానుకూలత వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద  కోరి తెచ్చుకున్న శైలజానాథ్ జగన్ సీటుకే ఎసరు పెట్టారన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.  

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.