విశాఖ తీరానికి రష్యా కెమికల్ దిగ్గజం?

Publish Date:Jun 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన'సాగుతోంది. మాస్కోలో జరిగిన ఒక అత్యంత కీలకమైన సమావేశం ఇప్పుడు ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది. రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, మిథనాల్ కెమికల్ ప్రాజెక్టులను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ రసాయన దిగ్గజ సంస్థ 'స్ కెమ్ గ్రూప్  ప్రతినిధులతో మంత్రి లోకేష్  భేటీ అయ్యారు. రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్, అంతర్జాతీయ వ్యాపార విభాగాధిపతి దర్యా అషానియాలతో కూడిన ఉన్నతస్థాయి బృందంతో ఆయన  చర్చలు జరిపారు. నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరప్రాంత రూపురేఖలను మార్చేసేలా లోకేష్ వారి ముందు ఉంచిన ప్రతిపాదనలు పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అపారమైన అవకాశాలను.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను రష్యా బృందానికి మంత్రి లోకేష్  సమర్థవంతంగా వివరించారు. భారతదేశం భారీ ఎత్తున దిగుమతి చేసుకునే పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్‌ను మన దేశంలోనే ప్రాసెస్ చేసేందుకు వీలుగా ఒక ప్రణాళికను, ప్రతిపాదనను లోకేష్ ఈ సందర్భంగా వారి ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలోని విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్  పరిధిలో రస్ కెమ్ ఆధ్వర్యంలో ఒక అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన రస్ కెమ్ ను  ఆహ్వానించారు.

కేవలం ప్లాంట్ ఏర్పాటు మాత్రమే కాకుండా..  సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్‌ల నిర్మాణం, బల్క్ కెమికల్ స్టోరేజీ వసతులు, ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్త్‌ల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఏపీలో ఉన్న అద్భుతమైన మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకుంటూ ఒక కొలాబరేటివ్ పాలిమర్ అప్లికేషన్, మెటీరియల్ సైన్స్ పరిశోధన కేంద్రాన్ని  స్థాపించాలని కోరారు.  పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే రసాయనాల తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని కోరారు.

మంత్రి నారా లోకేష్   ప్రతిపాదనలపై రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్  సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే తాము భారతదేశంలో ప్రత్యేక ఎస్‌పీవీల   ద్వారా హోల్‌సేల్ కెమికల్ పంపిణీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక భారత సంస్థలతో కలిసి పనిచేసేందుకు తమకు  ఆసక్తి ఉందని, ప్రస్తుతం ముంబై, కాన్పూర్‌లలో ఉన్న పంపిణీ కేంద్రాల ద్వారా దేశంలోని వివిధ పరిశ్రమలకు అవసరమైన రసాయనాలను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో గనుక ప్రాంతీయ సరఫరా కేంద్రం ఏర్పాటైతే, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో ఉన్న వందలాది ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలకు అవసరమైన అత్యంత కీలకమైన రసాయనాలను నేరుగా అందించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని భారీ పెట్రోకెమికల్ ప్లాంట్లను ఉపయోగించుకుని తమ గ్లోబల్ ఖాతాదారులకు స్థిరమైన సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ ప్రెజెంటేషన్,  ప్రతిపాదనలను  ప్రశంసించిన ఇల్యా కోసిహ్, వీటిపై తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో సమగ్రంగా చర్చించి, అతి త్వరలోనే ఏపీలో పెట్టుబడులపై ఒక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాల్చితే ఏపీ తీరప్రాంతం గ్లోబల్ కెమికల్ హబ్‌గా మారడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.