ఇక రుషికొండ ప్యాలెస్ హోటల్ రంగానికి

Publish Date:Jun 21, 2026

Advertisement

 

విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది. విశాఖలోని ఋషికొండ ప్రాంతంలో ఏపీ టూరిజం శాఖ పేరిట నిర్మించిన ఈ భవనాలను మంత్రులు పయ్యావుల కేశవులు, కందుల దుర్గేష్, బాల  వీరాంజనేయులు పరిశీలించారు. 

అక్కడ నాలుగు భవనాలు ఏ రకంగా నిర్మించారు అందులో ఏర్పాటు చేసిన సామాగ్రిని నిశితంగా పరిశీలించారు. ప్రధానంగా బాత్రూం.. బాత్ టబ్.. కమోడిటి లాంటి పరికరాలు ఎంత ఖరీదుగా ఏర్పాటు చేశారు. అన్న అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా దఫ దఫాలుగా ఈ భవనం నిర్మాణానికి నిధులు కేటాయించిన అంశాన్ని కూడా మంత్రులు పరిశీలించారు. రిసార్ట్స్ డెవలప్మెంట్ పేరిట ఈ భవనాలు నిర్మించారని ప్రతినెల నిర్వహణ కోసం దాదాపు 20 లక్షల ఖర్చు అవుతుందని మంత్రులు ప్రకటించారు. 

ఈ దేశంలో ఈ భవనాలను ఆతిథ్య రంగానికి పిపిపి పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించడంతోపాటు కొంత భాగాన్ని ప్రజల సందర్శనార్థానికి కేటాయిస్తున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఈ అంశాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్లడమే కాకుండా అనుభవం ఉన్న సంస్థలకు కేటాయించాలని ప్రతిపాదన కూడా ఇందులో చేయడం జరిగింది. త్వరలోనే దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకుంటామని కూడా మంత్రులు ప్రకటించారు..

జగన్ ప్రభుత్వం ప్రజలను మోసగించింది.. మంత్రి పయ్యావుల 

రుషికొండ భవనాల నిర్మాణం విషయంలో ప్రజలను అన్ని దశల్లో కూడా జగన్ ప్రభుత్వం మోసగించిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రధానంగా బాత్ టబ్  కుదాదాపు ఆరు లక్షలు ఖర్చు చేశారని... స్నానపు గదికి రెండు ఇళ్ల స్థలాన్ని వినియోగించారని విమర్శించారు. వాష్ రూమ్ కమోడిట్  నిధుల ద్వారా ఒక ఇంటిని నిర్మించవచ్చని మంత్రులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

విస్తీర్ణంలో కూడా 420 

రుషికొండ లోని ఏపీ టూరిజం భవనాన్ని లక్ష 35,420 చదరపు అడుగులు నిర్మించినట్టు మంత్రివర్గ ఉప సంఘం గుర్తించింది. ఇందులో కూడా 420 అక్షరాలు కనిపించాలని మంత్రులు పరోక్షంగా విమర్శలు చేశారు.
 

By
en-us Political News

  
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ప్రకటన
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు
బీజేపీ నా సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అన్నారు.
నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో యోగభ్యాసం చేయించిన రామ్ దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.