రుషికొండని ‘ఖుషికొండ’ చేశారు కదరా!
Publish Date:Jun 18, 2024
Advertisement
ఒరేయ్ దరిద్రపు సచ్చినోళ్ళారా.. సముద్రం ఒడ్డున పచ్చగా చెట్లతో కళకళలాడే రుషికొండ గుండు కొట్టి సర్వనాశనం చేశారు. పేరులోనే ‘రుషి’ వున్న ఆ కొండ మీద విలాసవంతమైన భవనాలు నిర్మించి, దానిని ‘ఖుషికొండ’గా మార్చేశారు కదరా.. ఆ కొండ మీద అప్పట్లో ఏ రుషి తపస్సు చేశాడో.. అందుకే ఆ కొండకి ‘రుషికొండ’ అని పేరు వచ్చిందో.. అలాంటి కొండ మీద మసాజులు చేయించుకునే విలాసవంతమైన బిల్డింగ్ కట్టి ఆ కొండ పవిత్రతనే దెబ్బతీసేశారు. బంగారం లాంటి కొండని నాశనం చేయొద్దురా మొర్రో అని ఎంతగా మొత్తుకున్నా మీరు విన్నారంట్రా.. పర్యావరణం పాడైపోతుంది దేవుడో అని బతిమాలుకుంటే పట్టించుకున్నారంట్రా.. కాసేపు టూరిజం బిల్డింగ్ అంటారు.. కాసేపు ముఖ్యమంత్రి ఇల్లంటారు.. ఇప్పుడేమో రాష్ట్రపతి, గవర్నర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు రెస్టు తీసుకోవడానికి కట్టించాం అని చెబుతున్నారు. ఈ చెప్పి చచ్చేదేదో మొదట్లోనే చెప్పొచ్చు కదా.. రోజుకోమాట చెప్పి జనాల చెవుల్లో పూలెందుకు పెట్టారు? మొన్నటి దాకా ముఖ్యమంత్రి ఇల్లు అని చెప్పి, ఇప్పుడు అధికారం కోల్పోగానే రాష్ట్రపతి, గవర్నర్ అంటున్నారు. ఏ రాష్ట్రపతి మిమ్మల్ని అడిగార్రా ఒక్కో బాత్ టబ్ 30 లక్షలు పెట్టి కొనమని? ఏ గవర్నర్ అడిగార్రా ఒక్కో టాయ్‌లెట్ కమోడ్ 16 లక్షలు పెట్టి కొనమని? ఆ బిల్డింగేంటి.. ఆ ఖర్చేంటి.. ఆరొందల కోట్లు అన్యాయంగా రాళ్ళపాలు చేశారు కదరా అరమైండు సన్నాసి మొహాల్లారా...
ఈ పాపం మీకు ఊరకే పోదురా. ఇప్పటికే మీరు సర్వనాశనం అయిపోయారు. ఇంకా దుంపనాశనం అయిపోతారు. మీ ముఖాల మీద పిచ్చుకలు రెట్టలెయ్య.. మీ ఇళ్ళలో గుడ్లగూబలు దూర.. ఇంత దరిద్రఫు ఫెలోస్ మీరెలా పుట్టిచచ్చార్రా? మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని అనుకుని మీ అయ్యగారి కోసం అంతంత బిల్డింగులు కట్టి ఏడిశారు.. మీ అమ్మగారి కోసం అన్నేసి సదుపాయాలు జనం సొమ్ముతో ఏర్పాటు చేశారు.. ఇప్పుడేమైందిరా?
http://www.teluguone.com/news/content/rushikonda-changed-as-khushi-konda-25-178916.html





