చంద్రబాబుతో పవన్ భేటీ వెనుక ఆర్ఎస్ఎస్?!

Publish Date:Jan 9, 2023

Advertisement

రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ వెనుక అసలు కారణమేమిటన్న ప్రశ్నకు అనూహ్యమైన సమాధానం పరిశీలకుల నుంచి వస్తున్నది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ కలవడం వెనుక ఉన్నది ఎవరన్న దానికి ఆర్ఎస్ఎస్ అన్న సమాధానం వస్తోంది. అసలు గత కొంత కాలం నుంచీ ఏపీలో అధికార వైసీపీ ఆగడాలను అడ్డుకోవడానికి, అరాచకాలను ప్రశ్నించి ఎదుర్కొనడానికి ఐక్య పోరాటం అవసరమన్న భావన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ చంద్రబాబుల భేటీకి అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

ఇంత కాలం ఎవరికి వారుగా ప్రజా క్షేత్రంలో జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ఇరు పార్టీల అధినేతలూ భేటీ అవ్వడాన్ని, రాష్ట్రంలో పరిస్ధితులపై మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని ఇరు పార్టీల శ్రేణులూ కూడా స్వాగతిస్తున్నాయంటేనే రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత అవగతమౌతుంది.  అయితే మరో వైపు జగన్ పూర్తిగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు దాసోహం అయిపోయారు. బీజేపీ అధినాయకత్వం తానా అంటే తందానా అంటున్నారు. అందుకు కారణమేమిటంటే.. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ తన దుర్మార్గ పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అయితే మరొక్క చాన్స్ తనకు దక్కితే ఇక ఎదురే ఉండదన్న భావనతో ఉన్నారు. 2024 ఎన్నికలలో అధికారాన్ని నిలుపుకోగలిగితే.. ఆ తరువాత ఎన్నికల సమయానికి చంద్రబాబు వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉండదన్నది జగన్ భావన. అందు వల్ల ఈ సారికి ఎలాగైనా అధికారం నిలుపుకుంటే.. ఇక తిరుగుండదన్న భావనలో ఉన్నారు. అందుకే ఇటీవల సమీక్షల్లో కూడా ఆయన పార్టీ శ్రేణులకు ఇదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తే ముఫ్ఫై ఏళ్ల పాటు మనదే అధికారం అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో మరో చాన్స్ మామూలుగా అయితే కష్టమన్న ఉద్దేశంతో ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ ను శరణు జొచ్చారు. మోడీ సర్కార్, బీజేపీ అండతో రానున్న ఎన్నికల గండాన్ని దాటేస్తే.. రాష్ట్రంలో ఇక ఎదురుండదు కనుక అప్పుడు అవసరమైతే రాష్ట్రలో తన వల్ల ఇప్పుడు బలోపేతంగా కనిపిస్తున్న బీజేపీని నిర్వీర్యం చేయవచ్చని ఆయన యోచిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే.. బీజేపీ మెంటార్ గా చెప్పబడే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు.  రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ పోకడలు నచ్చని ఆర్ఎస్ఎస్ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీ విజయం సాధించకూడదన్న భావనకు రావడం వల్లనే తెలుగుదేశం, జనసేనల మధ్య సయోధ్యకు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

రాష్ట్రంలో జగన్ సర్కార్ హిందుత్వ వ్యతిరేక పోకడలు, వైసీపీ హయాంలో  దేవాలయాలపై దాడులు, పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారం వంటి సంఘటనల పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉందని అంటున్నారు. అంతే కాకుండా.. తిరుమల పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా, ఒక ఆదాయవనరుగా భావిస్తూ..  కొండపై ఉన్న వసతి గృహాలలో రూము రెంట్  ను ఏకంగా ఒకేసారి రెండు రెట్లు అంతకంటే ఎక్కువగా పెంచడాన్ని కూడా ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది.  ఇంతవరకు  మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత వసతి గృహాల్లో రూ.500 నుంచి  రూ.600 వరకు ఉన్న గది అద్దెను ఒక్కసారిగా  రూ.1000కు పెంచేశారు. ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్  హౌస్‌ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. కార్నర్‌ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200కు పెంచారు. స్పెషల్‌ టైప్‌ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతో పాటు డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్‌ నగదుతో కలిపి రూ.3400 చెల్లించాల్సి ఉంటుంది.

 ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అవసరాలకు మించిన ఆదాయం వస్తున్నా, కొండపై భక్తులకు కల్పించే సదుపాయాలుమెరుగుపరచడం గురించి పట్టించుకోకుండా, టీటీడీ ప్రధాన కర్తవ్యమైన   హిందూ ధర్మ ప్రచారం, జీర్ణ ఆలాయాల పునరుద్ధరణ, హిందూ ధార్మిక కార్యకలాపాల నిర్వహణకు తిలోదకాలిచ్చేసి తిరుమలను కేవలం ఒక ఆదాయ వనరుగా ఎంచి ఇష్టారీతిన  వసతి రెంట్ లను ఇష్టారీతిగా పెంచేయడాన్ని ఆర్ఎస్ఎస్ తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్రంలో  తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన ఒక్కటే మార్గమన్న భావనతోనే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనానితో ఉన్న పరిచయాలను పురస్కరించుకుని ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లేలా ప్రోత్సహించిందని చెబుతున్నారు.

ఇరు పార్టీల మధ్యా సయోధ్య, అవగాహన తదితర అంశాలను పరిశీలించిన అనంతరం బీజేపీ స్టాండ్ ఏమిటన్నది తాము తేలుస్తామని ఆర్ఎస్ఎస్ పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే మొదట్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తాను అని చెప్పిన పవన్ కల్యాణ్ ఆ తరువాత స్టాండ్ మార్చుకున్నట్లు కనిపించినా ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో  వెనక్కు తగ్గి ఓటు చీలనివ్వనన్న స్టాండ్ ను పునరుద్ఘాటించారని చెబుతున్నారు. అందుకే చంద్రబాబుతో చర్చలలో ఇరు పార్టీల ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని అంటున్నారు.  జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటి దాకా వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలో పోరాడుతూ వచ్చినా ఇక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలన్న నిర్ణయానికి రావడం వెనుక.  జీవో నంబర్ 1 తో పాటుగా బీజేపీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు.

By
en-us Political News

  
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.