Publish Date:Sep 24, 2024
అడిగి మరీ తన్నించుకోవడం అంటే ఏంటో వైసీపీ నాయకురాలు రోజాని చూస్తే అర్థమవుతుంది. ఏ విషయంలో అయినా నోరు వేసుకుని పడిపోతూ, అబద్ధాన్ని నిజం చేయడానికి, నిజాన్ని అబద్ధం చేయడానికి రోజా ప్రయత్నిస్తూ వుంటారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ విషయంలో కూడా ఆమె తన నోటికి పనిచెప్పారు. సోమవారం నాడు తన సొంత యూట్యూబ్ ఛానల్లో కర్ణకఠోరంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆమె తన యూట్యూబ్ ఛానల్లోనే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే, ‘తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది?’. దీనికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ ఫొటోలు పెట్టి మూడు ఆప్షన్లు ఇచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్ తప్పు అని 7 శాతం, చంద్రబాబు తప్పు అని 20 శాతం, జగన్‌దే తప్పు అని 73 శాతం ఓట్లు పడ్డాయి. మరో ప్రశ్న ఏమిటంటే, ‘వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది?’ ఈ ప్రశ్నకు చంద్రబాబు పాలన బాగుందని 80 శాతం మంది ఓట్లు వేస్తే, వైఎస్ జగన్ పాలన బాగుందని 20 శాతం మంది అన్నారు. రోజా పెట్టిన ఈ ఓటింగ్‌లో వైఎస్ జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ పోలింగ్ నిలిపివేయకుండా ఉంచడం విశేషం. పోలింగ్ సంగతి అలా వుంటే, పోలింగ్ కింద వున్న కామెంట్లు అయితే మామూలుగా లేవు. రోజాని, జగన్‌కి దారుణంగా తిడుతున్నారు. ఆ తిట్లను మనందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇవ్వడం లేదు. ఇలా పోలింగ్ పెట్టడం ద్వారా అడిగి మరీ తన్నించుకుంటున్న రోజాకి అభినందనలు.
ఆర్కే రోజా తన యూట్యూబ్ ఛానల్ని సంవత్సరం క్రితం ప్రారంభించారు. తాను దగ్గినా, తుమ్మినా కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేశారు. వెయ్యికి పైగా వీడియోలు వున్నాయి. కాకపోతే ఛానల్ డిస్క్రప్షన్ చూస్తే మాత్రం జాలి కలిగేలా వుంది. ఎందుకంటే, దాంట్లో రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగానే వుంది. పాపం రోజా తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేదని అర్థమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-youtube-survey-25-185466.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.