రోజాకు ‘జబర్దస్త్’ సెగే తగిలిందా?

Publish Date:Sep 30, 2022

Advertisement

రోజా పరిచయం అక్కర్లేని పేరు. సినీ  నటిగా, రాజకీయ నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆమె ఎప్పుడూ సుపరిచితురాలే. వివాదాలు ఆమె వెంట ఉంటాయో, వివాదాలనే ఆమె ఆహ్వానిస్తారో తెలియదు కానీ  ఆమె పేరుతోనే పాటే వివాదాలూ గుర్తుకు వస్తాయి. సరే రోజా చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి ఎట్టకేలకు దక్కింది. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రోజాకు అవకాశం  కల్పించారు. అందు కోసం జగన్ సామాజికవర్గ సమీకరణాలను కూడా పక్కన పెట్టి చిత్తూరు జిల్లా నుంచి అప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా కూడా మరో మంత్రిగా రోజారెడ్డికి అవకాశం ఇచ్చారు.

ఒక జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కడమే అరుదైతే.. అలా మంత్రి పదవులు పొందిన వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం మరీ అరుదు. కానీ జగన్ రెడ్డి రో  ఆ సామాజిక వర్గ సమీకరణాలను సైతం పట్టించుకోకుండా రోజాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంత వరకూ బానే ఉంది. కానీ మంత్రి పదవి దక్కిన ఆనందం పూర్తిగా అనుభవించకుండానే రోజాకు పదవీ గండం తప్పదన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే గడప గడపకూ టెస్ట్ లో ఫెయిలయ్యారనీ, అధిష్ఠానం సూచనలు పట్టించుకోవడం లేదనీ, ప్రజాదరణ కోల్పోయారనీ ఇలా పలు కారణాలు చూపుతూ జగన్ వచ్చే నెలలో (నవంబర్) మరో సారి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని ఇటీవల జరిగిన వర్క్ షాపులో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అంతే కాదు తన ప్రస్తుత కేబినెట్ లో కనీసం ఐదో వంతు మందికి ఉద్వాసన తప్పదన్న సూచనలు కూడా ఇచ్చారు.

ఇదిగో అక్కడ నుంచీ రోజా మంత్రి పదవికి ఎసరు వచ్చేసిందన్న వార్తలు సమాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఉద్వాసనకు గురయ్యే మంత్రులలో మొదటి పేరు రోజాదే అన్న స్థాయిలో వార్తలు వినవస్తున్నాయి. అందుకు కారణాలను కూడా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పేస్తున్నారు. ఆ కారణాలలో మొదటిది ఆమెకు జబర్ దస్త్ కార్యక్రమం మీద ఉన్న మమకారంగా చెబుతున్నారు. చాలా సంవత్సరాల పాటు జబర్దస్త్ జడ్జి పొజిషన్ లో విరగబడి, పగలబడి నవ్వినందుకే  ఆమెకు సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఉన్నందువల్ల వచ్చిన పాపులారిటీని మించి ఎన్నో రెట్లు గుర్తింపు వచ్చింది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ విషయాన్ని పలు సందర్భాలలో ఎన్నో మార్లు ఆమే స్వయంగా చెప్పారు. తనకు అంత పాపులారిటీ తీసుకువచ్చిన షోను మంత్రి పదవి రాగానే వదిలేశారు. అయితే అంతటి పాపులారిటీ తీసుకువచ్చిన షో నిర్వాహకులు దసరా ఈవెంట్ కు ఆహ్వానిస్తే ఎలా కాదనగలరు? అందుకే వెళ్లారు. ఇదిగో ఇప్పుడు ఆ షోకు హాజరైన కారణంగానే రోజా పదవికి ఎసరు వచ్చిందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో షికార్లు చేస్తున్నాయి.

ఎందుకంటే.. ఆ షో వచ్చేది జగన్ నిత్యం ఆగ్రహంతో చెప్పే దుష్టచతుష్టయంలోని ఒకరికి చెందిన చానెల్ లో.. చెప్పాపెట్టకుండా ఆ షోలో రోజా ప్రత్యక్షం కావడంపై జగన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయనీ, జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ రోజాను ఫైర్ చేయాలని అనుకోవడానికి ఇది ఒక కారణం.. కాగా మంత్రిగా పదవీ స్వీకారం చేసిన క్షణం నుంచీ ఆమె పార్టీ హై కమాండ్ ఆదేశాలు, సూచనలను ఖాతరు చేయడం మానేశారని పార్టీ వర్గాలే అంటున్నాయి. మంత్రిగా ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అలా హైదరాబాద్ వెళ్లి ‘జగన్’మాత విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అప్పట్లోనే ఈ విషయంపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అప్పటికే జగన్ తల్లిని, చెల్లిని దూరం పెట్టిన విషయం తెలిసిందే.

ఇక ఆ తరువాత కూడా రోజా తన చిత్తం వచ్చిన తీరులోనే వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వచ్చారు. సరిగ్గా ఆమె కేసీఆర్ ను కలిసిన సమయంలోనే మంత్రి కేటీఆర్ క్రెడాయ్ సదస్సులో ఏపీలో జగన్ హయాంలో కరెంటు కష్టాలు, రోడ్ల దుస్థితిపై హేళన చేస్తూ మాట్లాడారు. ఇక మంత్రిగా రోజా పనితీరుపై కూడా జగన్ లో అసంతృప్తి ఉందని అంటున్నారు. మంత్రిగా గత ఐదు నెలల కాలంలో తన నియోజకవర్గం విషయంలో కానీ, తన శాఖ విషయంలో కానీ ఏ మాత్రం పట్టింపు లేని ధోరణిలో వ్యవహరిస్తున్నారని  జగన్ చేయించిన సర్వేలలో తేలిందని అంటున్నారు. అందుకే తాజాగా గడప గడపకు కార్యక్రమంపై  నిర్వహించిన వర్క్ షాపులో జగన్ మంత్రి రోజా పేరు ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రోజా మంత్రి అయిన తరువాత ఆ స్థాయిలో విపక్షాన్ని విమర్శిస్తూ విరుచుకుపడటంలేదని కూడా జగన్ భావిస్తున్నారంటున్నారు. ఇక సొంత నియోజకవర్గంలో కూడా ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని వివిధ సర్వేలలో తేలిందని కూడా అంటున్నారు. ఎమ్మెల్యేగానే కాదు, మంత్రిగా కూడా ఆమె తన స్వంత నియోజకవర్గం నగరిపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. ఈ కారణాలన్నిటినీ ప్రస్తావిస్తూ వైసీపీ వర్గాలే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనకు గురయ్యే మంత్రుల జాబితాలో తొలి పేరు రోజాదే అని అంటున్నారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.