హైపర్ ఆదికి రోజా సపోర్ట్

Publish Date:Jan 20, 2023

Advertisement

పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, జగన్ మీద పోటీకి సిద్ధం .. హైపర్ ఆది..  ఇంతకీ ఈ హైపర్ ఆదీ ఎవరు? చాలామందికి తెలియక పోవచ్చును కానీ, ఓ ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే ... ఓ బూతు కామెడీ షో చూసే వారికి మాత్రం ఇతగాడి పరిచయం అవసరం లేదు. సరే .. ఇప్పుడు విషయం అదికాదు కాబట్టి, ఆవిషయాన్ని పక్కన పెట్టి, విషయంలోకి వస్తే... ఈ ఆది అనే వాడు... జనసేన వేదిక నుంచి పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ ప్రభత్వం పై సెటైర్లు, పంచ్ డైలాగులతో విరుచుకు పడ్డారు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, జగన్ మీద పోటీకి సిద్ధం, అంటూ జగన్ రెడ్డి ఇమేజ్ మొత్తాన్ని బెలూన్ లో గాలిలా కామెడీగా తీసి పారేశారు. మరో కమెడియన్, ఏపీ సర్కార్ లో ఉన్నశతకోటి సలహాదారుల్లో .. మరో సలహదారు అలీ, ఇటీవల జగన్ రెడ్డి ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని చేసిన కామెంట్ కు కౌంటర్ గా ఆది ఈ వ్యాఖ్య చేశారు  కావచ్చు.   

అయినా, ఆది కామెంట్స్ మీద వైసేపీ నేతలు భగ్గుమంటున్నారు. కొంచెం చాలా తీవ్రంగానే హెచ్చరిస్తున్నారు. అతగాడి భాషలోనే సమాధానం ఇస్తున్నారు. కానీ మంత్రి రోజా మాత్రం, ఆది అమాయకుడు అంటూ కితాబు నిస్తున్నారు. జగన్ రెడ్డిని ఇంతవరకు ఎవరూ దూషించనంతగా దూషించడమే కాకుండా తలకాయ ఎక్కడ  పెట్టుకోవాలో తెలియని విధంగా తొడగొట్టి సవాలు విసిరిన ఆది ని నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు అంటూ మంత్రి రోజా సర్టిఫికేట్ ఇస్తున్నారు.

అయితే రోజా రియాక్షన్ చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎవరైనా చిన్నమాట అంటేనే రెచ్చిపోయే రోజా అంతలేసి మాటలన్న ఆది విషయంలో ఎందుకిలా ‘చిన్నోడు’ ఏమీ తెలియని అమాయకుడు అంటూ చిరునవ్వుతో ఎందుకు సమర్ధించు కొచ్చారు? ఆ మాటలు అన్నది ఆది అయినా అనిపించింది, మెగా ఫ్యామిలీ  అంటూ, ఊరుము ఉరిమి మంగలం మీద పడినట్లు చిరంజీవి ఫ్యామిలీ మీద ఎందుకు పడ్డారు? ఆదిని రక్షించే బాధ్యతను ఆమె ఎందుకు భుజాల మీద వేసుకున్నారు? ఎందుకు ఆదికి అండగా నిలిచారు? అంటే అందుకు మంత్రి రోజా పూర్వాశ్రయంలో, జబర్దస్త్ షో జడ్జిగా ఈ ఆది వేసిన జోకులకు పగలబడి నవ్వారు. ఆ విధంగా ఆ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ బంధం ఉంటే ఉండవచ్చని, అందుకే ఆమె, ఆది మీద ఆగ్రహాన్నిడైవెర్ట్ చేసేందుకే మెగా ఫ్యామిలీ మీద మండి పడుతున్నారనే టాక్ ఒకటి నడుస్తోంది. 

చిరు ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా మందిని నాశనం చేశారు, చిరు ఫ్యామిలీ మాట వినకుంటే సినిమా అవకాశాలు రావు, మెగా ఫ్యామిలీలో హీరోలకు వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ లో ఏమి లేకుండా చేస్తారు. అందుకే ఆది లాంటి చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటూ చెప్పు కొచ్చారని అంటున్నారు. అయితే  ఆది మరీ అంత అమాయకుడు కాదని, అతగాడికీ మంత్రి రోజా స్థాయిలో రాజకీయ కోరికలున్నాయని అంటారు. రణస్థలంలో ఇటీవల జనసేన నిర్వహించిన యువశక్తి సభలోనూ ఆది ఘాటుగా మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చేందుకే ఆది అలా రెచ్చిపోయారని అంటున్నారు. 

మరో వంక ప్రకాశం జిల్లాకు చెందిన హైపర్ ఆది.. సొంత జిల్లా నుంచే పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. దీంతో ప్రధానంగా రెండు నియోజక వర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిలో గిద్దలూరు నియోజకవర్గం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆది సొంత ఊరికి దగ్గరలోనే ఈ నియోజకవర్గం ఉంది. అక్కడ జనసేన పార్టీ కూడా బలంగా ఉందని జనసేన నేతలు చెబుతున్నారు.అయితే, పులివెందులలో  జగన్ రెడ్డి పైనే పోటీకి సై అంటున్న ఆది..నగరిలో మంత్రి రోజా పై పోటీ అంటే ఏమంటారో ..  సై ..అంటారా .. నై అంటారా? ఊ అంటారా.. ఊహూ అంటారా అటూ సోషల్ మీడియాలో పంచుల మీద పంచులు పడుతున్నాయ్ .. అయితే, రాజకీయాలు ‘జబర్దస్త్’ స్థాయికి  పడిపోవడమే కొంచెం చాలా విచారం ... అనే బాధపడేవాళ్ళు బాధపడుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.