మంత్రి ఆర్కే రోజా సినీమాల నుంచి రాజకీయాలలోకి వచ్చారు. ఇప్పుడు రాజకీయ వేదికలపై సినిమా చూపిస్తున్నారు. ఏపీ మంత్రులందరిలోనూ రోజా స్పెషల్. ఆమె ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ వంటి వారు. ఎవరి మాటా వినరు. ఆమెకు ఏం అనిపిస్తే అది మాట్లాడేస్తారు. ఏం అనిపిస్తే అది చేసేస్తారు. రోజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మితో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీలో జరిగిన పరిణామాలతో ఎవరూ విజయమ్మతో భేటీకి ఆసక్తి చూపించడం లేదు. కొత్త మంత్రులెవరూ కనీసం ఆమె పేరు కూడా తల్చుకోలేదు. కొఅసలు విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలు అని దాదాపు అందరూ మరచిపోయారు. కానీ రోజా మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకుని మరీ హైదరాబాద్ వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇదే విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉన్న షర్మిల నివాసంలో రోజా విజయమ్మతో భేటీ అయ్యారు. తనకు మంత్రి పదవి లభించిన సందర్భంగా విజయమ్మ ఆశీస్సులు తీసుకోవాలని కొంత కాలంగా రోజా ప్రయత్నిస్తున్నారని ఇప్పటికి కుదిరిందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆ వర్గాలు అంటున్నప్పటికీ, జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలను దూరంగా పెడుతున్న నేపథ్యంలో రోజా ప్రత్యేకంగా విజయమ్మతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు గంటల పాటు విజయమ్మతో భేటీ అయిన రోజా తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు తెలంగాణలో షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందన పైనా చర్చించినట్లు చెబుతున్నారు. ఇక అంతకు ముందు కూడా రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో కేటీఆర్ ఏపీలో సౌకర్యాలపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గు మంటున్నారు. రోజా కేసీఆర్ ను కలవడానికి ఆ టైంను ఎన్నుకోవడంపైనా పార్టీలో ఒకింత అసంతృప్తి వ్యక్తమైంది. ఇప్పుడు పార్టీ అధినేతకు కనీస సమాచారం ఇవ్వకుండా విజయమ్మతో భేటీ అయ్యారు. ఇంతకీ రోజా విజయమ్మతో భేటీ కావడం వెనుక ఉన్న వ్యూహమేమిటి? జగన్ అంగీకారంతోనే ఆమె విజయమ్మను కలిసి ఉంటారనీ ఒక వాదన వినిపిస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-meets-vijayamma-what-is-the-reason-25-135381.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.