రోజాకు పదవొచ్చింది.. కవితకు ఎప్పుడో!?

Publish Date:Apr 13, 2022

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాలలో మహిళ రాజకీయ నాయకురాళ్ళకు కొదవలేదు. కానీ, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ఆర్కే రోజా..లకున్న గుర్తింపు ప్రత్యేకం. నిజానికి, ఆ ఇద్దరికీ మధ్య చెప్పుకోదగిన సారుప్యతలు పెద్దగా కనిపించవు. కానీ, ఆ ఇద్దరి ‘పొలిటికల్ యాంబిషన్’ ఒకటే కావడం వలన, ఇద్దరూ చెరో తెలుగు రాష్ట్రానికి చెందినా, ఒకటిగానే చూడడం జరుగుతుంది. ఈ ఇద్దరికీ కూడా మంత్రి కుర్చీలో కూర్చోవాలనే కోరిక చాలా బలంగా ఉందనేది,అందరికీ తెలిసిన నిజం. రోజా అయితే, మంత్రి పదవికోసం, ఎన్ని గుళ్ళు తిరిగారో, ఎంత మంది స్వాములను, స్వామీజీలను కలిశారో లెక్క లేదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక మీదకు వెళుతున్న సమయంలో, ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆమెలో కనిపించిన ఎక్సైట్మెంట్ గమనిస్తే, ఆమె మంత్రి పదవిని ఎంతగా ఆశించారో అర్థమవుతుంది.ఎలాగైతే నేమి, ఆమె కలఫలించింది.

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా, మంత్రి పదవికోసం చాలా గట్టి ప్రయత్నాలే చేశున్నారు.పుట్టింటి మీద అలిగి, పంతం నెగ్గించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, ఇంతవరకు ఆమె ఆశ, ఆశయం నెరవేరలేదు.రాజకీయ కుటుంబనేపధ్యం లేకున్నా రోజా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నూతన మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.పర్యాటక, సాంస్కృతిక, యువజన సేవల మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. కానీ, రాజకీయ కుటుంబ నేపధ్యమే కాకుండా, కుటుంబ పార్టీ (తెరాస)ఇంటి ఆడబిడ్డ అయి ఉండి కూడా, కవిత మంత్రి కాలేక  పోయారు. ఎనిమిది ఏళ్లుగా తెలంగాణలో ఫ్యామిలీ పాలనే సాగుతున్నా, ముఖ్యమంత్రి కుమార్తె కవిత మంత్రి కాలేక పోవడం నిజంగా ఆశ్చర్య పరిచే విషయమే. కానీ, అందుకు కారణాలు లేక పోలేదు.అందులో కుటుంబ పార్టీ కావడం కూడా ఒక కారణం. 

తెరాస కుటుంబ పార్టీనే అయినా, కుటుంబంలోని అంతర్గత విబేధాల కారణంగానే కవితకు మంత్రి పదవి దక్కలేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె చాలా కాలంగా అలిగి  కుటుంబ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. చివరకు, ఆమె కొట్లాది ఎమ్మెల్సీ టికెట్ అయితే తెచ్చుకున్నారు. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్సీ అయ్యారు. కానీ, మంత్రి పదవి మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలి పోయింది. ఒక వేళ సమీప భవిష్యత్’లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపడితే మాత్రం కవితకు మంత్రి కుర్చీ ఖాయమంటున్నారు. కానీ, కేసీఆర్ మంత్రి వర్గాన్ని విస్తరిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నగానే ఉందని అంటున్నారు. అలాగే, ఒకే కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు, ముఖ్యమంత్రి కేసీఅర్, మంత్రి కేటీఅర్, మరో మంత్రి హరీష్ రావు మంత్రివర్గంలో ఉన్న నేపద్యంలో మరొకరికి   ఆకాశం కల్పిస్తారా అనేది కూడా అనుమానమే అంటున్నారు. మరో వంక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆశగా ఎదురు చూస్తున్న కేటీఆర్’కు కూడా కుటుంబ రాజకీయ కలహాలే స్పీడ్ బ్రేకర్ గా అడ్డుపడుతున్నాయని అంటున్నారు. సో .. ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసే లోగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం, కవిత మంత్రి కావడం రెండూ కష్టమే అంటున్నారు.

నిజమే, రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా పదవులపై ఆశ ఉంటుంది. అలాంటిది, రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబంలో పుట్టి, కుటుంబ పార్టీలో క్రియాశీలంగా ఉన్న ఒక కేటీఆర్, ఒక కవితకు ఉన్నత పదవులపై ఆశలు ఉండడం అసహజం కాదని, కానీ, కోరికలు గీత దాటితేనే ప్రమాద మంటున్నారు. తెరాసలో కుటుంబ కలహాలకు ఆ స్థాయికి  చేరాయా..? గీత దాటాయా.. అంటే పరిశీలకులు అవుననే అనవలసి వస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.