Publish Date:Oct 17, 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా.. వ్యవహార శైలి పట్ల ప్రజలే కాదు.. ఆమె సొంత పార్టీలోని కీలక నేతల నుంచి క్యాడర్ వరకు అంతా... అయ్యయ్యో ఇదేంటి.. ఇలా చేస్తోందేంటి... అంటూ ముక్కన వేలేసుకొంటున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో వైసీపీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన విశాఖ గర్జనలో మంత్రులు, పలువురు కీలక నేతలు ప్రసంచిన సంగతి తెలిసిందే. గర్జన అనంతరం రోజాతోపాటు పలువురు కీలక నేతలు తిరుగు ప్రయాణం కోసం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఆ సమయంలో ఎయిర్ పోర్ట్ వద్ద రోజా చేష్టల పట్ల.. ఎయిర్ పోర్టు సిబ్బందే కాదు.. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మంత్రి ఆర్కే రోజా వెకిలి చేష్టలకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తోంది. మంత్రి రోజా ఏమిటీ.. ఇలా చేయడం ఏమిటి.. బూతూ... బూతూ అంటూ ఓ వైపు, రోజా అడ్డంగా దొరికిపోయిందంటూ మరోవైపు నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలంటూ ఇటీవల అధికార ఫ్యాన్ పార్టీ నేతలు విశాఖ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ ముగించుకొని.. మంత్రులు, పలువురు కీలక నేతలు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే అదే రోజు.. విశాఖలో జనవాణి కార్యక్రమం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. విశాఖకు చేరుకొన్నున్నారు. ఆ క్రమంలో ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలు జనసైనికులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్‌తో నిండిపోయింది. దీంతో ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పవన్‌కు అనుకూలంగా.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సందర్భంగా.. పర్యాటక శాఖ మంత్రి రోజా వేలు ఎత్తి చూపించడం పట్ల.. సొంత పార్టీలోని వారే అసహ్యించుకోవడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-deeds-in-airport-attracts-criticism-from-every-corner-25-145579.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్