జగనన్నను మించిన దైవమున్నదా? రోజా కొత్త భజన

Publish Date:Aug 28, 2023

Advertisement

కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ  
ఇతడే దిక్కని మొక్కని వాడికి
దిక్కు మొక్కు లేదండండీ  


ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఈ కొత్త దేముడి భజన వేరే లెవల్ లో సాగుతోంది. ఇంతకీ ఈ కొత్త దేముడెవరంటారా? సందేహమెందుకు వైసీపీ నేతలు, మంత్రులూ చెబుతున్న కొత్త దేముడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డే. అవును ఎన్నికల సమయం ముంచుకు వస్తున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్ లో ఉంది. కేసులు, అరెస్టులు, లాఠీ దెబ్బలు, పథకాల కోత బెదరింపులు ఇవేవీ ప్రజల మీద పని చేయడం లేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలలో మరోసారి విజయం సాధించాలంటే కొత్త ముఖాలను ఎన్నికల బరిలో దింపడం వినా మరో మార్గం లేదని భావిస్తున్నారు. దీంతో సీనియర్లు, జూనియర్లు, మంత్రులు, మాజీ మంత్రులు అన్న తేడా లేకుండా వైసీపీలో చాలా మంది సిట్టింగులకు టికెట్ భయం పట్టుకుంది. ప్రజలలో పలుకుబడి ఉన్న వారు టికెట్ రాకపోతే పార్టీకి గుడ్ బై కొట్టేసి వెళ్లి పోతారు. అధినేత తీరు నచ్చకపోయినా ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసి పార్టీ వదిలేస్తారు. కానీ కొందరు మంత్రులు, మాజీ మంత్రులకు ఆ పరిస్థితి లేదు. అందుకే వారు తమ అధినేతను కొత్త దేముడిగా, కొంగొత్త దేవుడిగా కీర్తిస్తూ టెకెట్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో రోజు చేసిన ప్రసంగం వింటే ఈ తరహా భజనలో ఆమె ఆరితేరారని అనిపించక మానదు. నగరిలో సోమవారం (ఆగస్టు 28) జగనన్న విద్యాదీవెన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రోజా ప్రసంగించారు. ఆకాశమే హద్దుగా పొగడ్తల వర్షం కురిపించేశారు. నగరి నియోజకవర్గానికి జగన్  తొలిసారిగా విచ్చేశారని చెప్పిన మంత్రి రోజా జగనన్నను మించి దైవమున్నాదా అన్న రీతిలో పొగడ్తల వర్షం కురిపించేశారు. పనిలో పనిగా విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలూ గుప్పించేశారు. ఇక జగన్ విషయంలో ఆమె ప్రశంసలు అన్ని హద్దులనూ మీరిపోయాయి. జగన్ ను కొత్త దేముడిని చేసేశాయి. ఆమె ఏ స్థాయిలో నేత విడిచి సాము చేశారంటే ‘మీరు రాముడిని పూజించినా... అల్లా ను ఆరాధించినా, ఏసు ప్రభువును ప్రార్ధించినా... మిమ్మల్ని ఉన్నత విద్యలు చదివించేది మాత్రం ఆ దేవుడు పంపిన జగనన్నే’అనేశారు. అదే వేదిక మీద కూర్చున్న జగన్ ఈ ప్రసంగం వింటూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.

ఇంతకీ రోజాకు పొగడ్తలు కొత్తేమీ కాదు. గతంలో తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఈ స్థాయికి పెద్దగా తగ్గకుండానే ఆమె చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. అదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ తరువాత తెలుగుదేశం వీడి కాంగ్రెస్ పంచన చేరుందుకు ప్రయత్నించిన సమయంలో వైఎస్ పైనా పొగడ్తలు కురిపించారు. ఇప్పుడు జగనన్న ను పొగుడుతున్నారు. అయినా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కుతుందా లేదా అన్న టెన్షన్ లో ఉన్న రోజా జగన్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగడితే  పాస్ మార్కులు పడతాయని భావిస్తున్నట్లున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.

నగరిలో ప్రస్తుతం రోజాకు ఎదురుగాలి వీస్తున్నదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డితో పొసగకపోవడం, నియోజవకర్గంలో కూడా ఆమెకు వ్యతిరేకంగా పని చేసే గ్రూపు పెద్దిరెడ్డిఆశీస్సులతో బలోపేతం కావడంతో ఆమెకు ఒకింత చిక్కులు తప్పడం లేదని అంటున్నారు. ఇక అన్నిటికీ మించి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఆమెకు కనీస సమాచారం అందని పరిస్థితి ఉందని చెబుతున్నారు. వీటన్నిటికీ మించి గతంలో గడపగడపకూ కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్ లో పని తీరు మెరుగుపరచుకోవాలంటూ జగన్ మందలించిన నేతలలో రోజా కూడా ఒకరని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో నగరి నియోజకవర్గ వైసీపీ టికెట్ రోజాకు దక్కే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న గుసగుసలు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్న నేపథ్యంలో రోజా జగన్ పై ప్రశసంల వర్షం కురిపించడం, అపర దేవుడిగా కీర్తించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ టికెట్ కోసం కోటి విద్యలు అంటూ  వైసీపీ శ్రేణుల నుంచే సెటైర్లు పేలుతున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.