భువనేశ్వరిపై హద్దూ పద్దూ లేని రోజా విమర్శలు!?

Publish Date:Oct 26, 2023

Advertisement

విధ్వంసానికీ.. నిర్మాణాత్మకతకు తేడా స్పష్టంగా తెలిసిపోయింది. జగన్ సర్కార్ మాత్రమే కాదు.. ఆయన నాయకత్వంలోని పార్టీ, ఆయన కేబినెట్ సహచరులు అందరిదీ ఒకే మైండ్ సెట్.. ఆత్మస్థుతి.. పరనింద. స్పష్టంగా కనిపిస్తున్న సొంత తప్పిదాలను పట్టించుకోకుండా, కనీసం ఆ తప్పులను సరిచేసుకునే ప్రయత్నం ఏమీ చేయకుండా వాటిని ఎత్తి చూపిన వారిపై మాటల దాడికి పాల్పడటంలో అధికార పార్టీ, జగన్ ప్రభుత్వం మాస్టర్ డిగ్రీ సాధించిందని చెప్పవచ్చు.

రాజకీయాలలో  కనీస విలువలకు కూడా తిలోదకాలిచ్చిన జగన్ సర్కార్, ఆయన పార్టీ నేతలు తప్పులు చేస్తాం? ఎత్తి  చూపిస్తే వ్యక్తిగతంగా దూషణలకు దిగుతాం  అన్నట్లు వ్యవహరిస్తున్నది. తన భర్త, తెలుగుదేశం అధినేత   నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, ఆయన అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రజలలోకి వెడుతున్న నారా భువనేశ్వరిపై తమకు మాత్రమే ప్రత్యేకం అనదగ్గ  అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వెగటుపుట్టిస్తున్నాయి. వైసీపీలో ఇటువంటి  అనుచిత  వ్యాఖ్యలు చేయడానికీ, అడ్డగోలు  విమర్శలకూ ఒక ప్రత్యేక బ్యాచ్ ఉంది. తాడేపల్లి  ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావడం ఆలస్యం ఈ బ్యాచ్ మైకుల ముందుకు వచ్చేస్తుంది. 

ఇప్పుడు కూడా అదే  జరిగింది. తెలుగుదేశం అధినేత నారా భువనేశ్వరి చంద్రగిరి సభలో ప్రసంగానికి అనూహ్య స్పందన రావడం ఆలస్యం జగన్ పార్టీ బ్యాచ్ అనుచిత వ్యాఖ్యలతో, అడ్డగోలు విమర్శలతో రంగంలోకి దిగిపోయింది. తమ వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారు అన్న విషయం వాళ్లకు పట్టదు. తమ అధినేతకు నచ్చితే చాలు అన్నట్లుగా వారి తీరు ఉంటుంది. అందులోనూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడటంలో ముందుండే మాజీ మంత్రి కొడాలి నాని, ప్రస్తుత మంత్రి రోజాలు అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు విమర్శలలో  సిద్ధహస్తులు అని రాజకీయవర్గాలలో పెద్ద టాక్ నడుస్తోంది. 

ఇప్పుడు నారా భువనేశ్వరిపై వారు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 
నోటికొచ్చినట్లు మాట్లాడేయడం.. ఎవరైనా గట్టిగా రిటార్డ్ ఇస్తే.. ఒక మహిళనని కూడా చూడకుండా ఇలా మాట్లాడతారా అంటూ మైకుల ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టే రోజా, నోరు ఉన్నది బూతులు మాట్లాడడానికే అన్నట్లుగా వ్యవహరించే కొడాలి నానిలు రంగంలోకి దిగారు. భువనేశ్వరి యాత్రను ఫ్యాషన్ షోగా రోజా అభివర్ణిస్తే.. తాను మాత్రమే మాట్లాడగలిగిన ప్రత్యేక బాషలో కొడాలి నాని నోటికి పని చేప్పారు. వెల్లంపల్లి కూడా అవాకులూ చవాకులూ పేలారు. 

నారా భువనేశ్వరిది ఫ్యాషన్ షో అన్న రోజా వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విమర్శలకు ఒక హద్దూ పద్దూ, పద్ధతీ పాడూ ఉండదా అని నెటిజన్లు రోజాను చెరిగి పారేస్తున్నారు. 
గతంలో ఎన్నికల ప్రచారంలో చుడీదార్ వేసుకున్న భూమా అఖిల ప్రియపై కూడా రోజా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఎమ్మెల్యేగా ఉంటూ కూడా జబర్దస్త వంటి  కార్యక్రమంలో వెకిలి జోకులకు ఆమె నవ్విన నవ్వులు, చేసిన డ్యాన్సులూ మాత్రం ఇటువంటి  విమర్శలు చేసే సమయంలో రోజాకు గుర్తుకు రావా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

ఇంతకీ విషయానికి వస్తే నారా భువనేశ్వరి తన భర్త అక్రమ అరెస్టును నిరసిస్తూ తొలి సారిగా ప్రజా బాహుల్యంలోకి వచ్చారు. తన భర్త అక్రమ అరెస్టును తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగానే వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. సభలలో ప్రసంగాలు చేస్తున్నారు.  అన్నిటికీ  మించి గత  నెలన్నరగా  ఆమె రాజమహేంద్రవరంలోనే మకాం వేసి తరచుగా చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, సౌకర్యాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అటువంటి  భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత మాటల దాడి కచ్చితంగా బూమరాంగ్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు ఎంతగా గింజుకున్నా, బరితెగించి అనుచిత వ్యాఖ్యలతో బజారున పడినా.. జనం మాత్రం భువనేశ్వరి యాత్రకు స్వాగతం పలుకుతున్నారనీ, పలుకుతారనీ, ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారనీ,తెలుపుతారనీ తెలుగుదేశం శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. చంద్రబాబు  అరెస్టుతో జగన్ పనైపోయిందనీ, ఈ విషయం అందరికంటే వైసీపీయే బాగా తెలుసుననీ, అందుకే  వారిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరి..ఇలా నోటికి పని చుబుతూ ప్రజలలో  మరింత పలుచన అవుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.