రోజా కొబ్బరికాయ కొట్టింది.. పాదయాత్ర ఆగింది..
Publish Date:Nov 4, 2017
Advertisement
పాపం రోజాకి ప్రస్తుతం రోజులు ఏం బాలేనట్టు ఉన్నాయి. ఏం చేసినా రివర్స్ లో కొడుతుంది. నిజం చెప్పాలంటే రోజాను టీడీపీ నేతలు ఎప్పుడో మరిచిపోయారు. ఎందుకంటే ఇప్పుడు రోజాను సొంత పార్టీ నేతలే తిట్టిపోసుకునే పరిస్థితి వచ్చింది. వైసీపీ పార్టీలో చేరిన కొత్తల్లో రోజా కు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. నిజం చెప్పాలంటే జగన్ తరువాత రోజానే అన్నంత పేరు కూడా తెచ్చుకుంది. ఇంకేముంది కొమ్ములొచ్చిన రోజా ఆ తరువాత రెచ్చిపోవడం స్టార్ట్ చేసింది. అదే ఇప్పుడు ఆమెకు మైనస్ పాయింట్ అయింది. నంద్యాల ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి సగం కారణం రోజానే అని సొంత పార్టీ నేతలే మండిపడ్డారు. దాంతో ఆమెను కొంత కాలం మీడియాకు దూరంగా ఉండమని జగన్ ఆదేశించడంతో అప్పటినుండి ఆమె మీడియాకు కాస్త దూరంగానే ఉంది. జగన్ పాదయాత్రపై మాట్లాడేందుకు మరోసారి మీడియా ముందుకు వచ్చి అక్కడ కూడా బుక్ అయింది. పాదయాత్ర విషయంలో డీజీపీ అనుమతిపై వైసీపీ పార్టీ నేతల వ్యూహాలను ఆవేశంతో బయటపెట్టిందని మళ్లీ పార్టీ నేతలు కోప్పడటం.. జగన్ రోజాకు క్లాస్ తీసుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు మరోసారి రోజాను పార్టీ నేతలు తిట్టుకుంటున్నారంటా.. ఎందుకంటే... జగన్ తిరుమల కొండపైకి కాలినడక రావాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు. కానీ అది కాస్త రద్దయింది. దీనికి కారణం.. జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని తిరుమల కొండపై 1000 కొబ్బరికాయలు కొట్టిందట. ఇంకేముంది రోజా కొబ్బరికాయలు కొట్టింది జగన్ పాదయాత్ర ఆగిపోయింది అని అంటున్నారు. ఇక టీడీపీ నేతలైతే రోజా ఎప్పుడూ జగన్ తోనే ఉండాలని.. సెటైర్లు వేసుకుంటున్నారు. పాపం మొత్తానికి రోజా ఇప్పుడు ఏం చేసినా చిరిగి చేటంత అవుతుంది. మరి వైసీపీలో రోజా భవిష్యత్తు ఎలా ఉంటుందో..?
http://www.teluguone.com/news/content/roja-39-78625.html





