లార్డ్స్ లో రోహిత్ రిటైర్మెంట్ ప్రకటన?
Publish Date:Jul 17, 2026
Advertisement
భారత క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు లార్డ్స్ వేదికగా గుడ్ బై చెప్పనున్నాడా? త్వరలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2027 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సంబంధించి బీసీసీఐ ఇప్పటి నుంచే భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, అందులో రోహిత్ శర్మకు చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి, క్రికెట్ రంగానికి ఘనంగా గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధమవుతోందనే వార్తలు జోరందుకున్నాయి. క్రీడా వర్గాల సమాచారం మేరకు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశం ఇసుమంతైనా లేదు. వయసు రీత్యానే కాకుండా ఫామ్ విషయంలో కూడా రోహిత్ ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఇసుమంతైనా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లండన్ వేదికగా రోహిత్ శర్మకు ఒక ప్రత్యేకమైన, ప్రతిష్టాత్మకమైన వీడ్కోలు ఇచ్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రోహిత్ శర్మ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్‌కు చేరుకున్నారు. ఒక క్రీడాకారుడి కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అనేది భావోద్వేగంతో కూడుకున్న విషయం కాబట్టి, ఆ భావోద్వేగ భరిత క్షణాలలో రోహిత్ కుటుంబం, తల్లిదండ్రులు లండన్ చేరుకున్నారని అంటున్నారు. క్రికెట్ మక్కాగా గుర్తింపు పొందిన లార్డ్స్ మైదానంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రీడా పండితులు అంటున్నారు. అయితే ఈ విషయంపై అటు బీసీసీఐ నుంచి కానీ, ఇటు రోహిత్ శర్మ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా ఇంత వరకూ రాలేదు. అది పక్కన పెడితే ఇండియన్ క్రికెట్ లో రోహిత్ శర్మ పలు చిరస్మరణీయమనదగ్గ రికార్డులు సృష్టించాడు. వన్డే క్రికెట్ లో మూడు డబుల్ సెంరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సాధించారు. BCCI Rohit Sharma Decision, Lords Cricket Ground, 2027 ODI World Cup Team India
http://www.teluguone.com/news/content/rohits-retirement-announcement-at-lords-36-226310.html





