హిట్ మ్యాన్ రికార్డుల మోత

Publish Date:Mar 29, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ లోనే ఘన విజయం సాధించింది. ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లో విజయం సాధించడం ముంబై ఇండియన్స్ కు ఇదే తొలిసారి. కోల్ కతా నైట్ రైడర్స్ లో  ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో  సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయ‌ర్‌ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.  ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో తన 50వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో కేవలం 39 బంతుల్లోనే 78 పరుగులు చేసి, ఒకే మ్యాచ్‌లో రెండు  రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

కోల్‌కతా నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో 50 లేదా అంతకంటే ఎక్కువ సార్లు యాభైకి పైగా స్కోర్లు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (72), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధావన్ (53) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.   

అది పక్కన పెడితే ఈ మ్యాచ్ లో తన ఇన్నింగ్స్ తో హిట్ మ్యాన్ మరో అరుదైన రికార్డు కూడా సాధించాడు. అదేంటంటే..  ఐపీఎల్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతాపై ఇప్పటివరకు 1161 పరుగులు చేసిన రోహిత్, పంజాబ్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ చేసిన 1159 పరుగుల రికార్డును అధిగమించాడు.  

ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌తో కలిసి రోహిత్  తొలి వికెట్‌కు 148 పరుగులు జోడించారు. కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.  

By
en-us Political News

  
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.