రోహిత్ శతకం వృధా.. లార్డ్స్ లో ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ కైవశం.!

Publish Date:Jul 19, 2026

Advertisement

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్  ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ  స్కోరును సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ 141 పరుగులతో   శతకబాదాడు.  జాకబ్ బెథెల్ 91 పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన జో రూట్ 74 పరుగులు, కెప్టెన్ జాస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే   41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.    భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు 2 వికెట్లు దక్కగా, మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ న ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు  147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత అభిమానుల్లో విజయంపై ఆశలు రేపారు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ 84 బంతుల్లో 77 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను   ముందుకు నడిపించాడు. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేసి రాణించాడు. వీరు రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించడంతో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది.

ఇటీవలి కాలంలో ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతూ.. జట్టులో స్ధానమే అనుమానమన్న రీతిలో విమర్శలు ఎదుర్కొన్న  రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 85 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేసిన రోహిత్, మొత్తం 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. ఈ శతకంతో రోహిత్ శర్మ క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన మొదటి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. అ . ఇది రోహిత్‌కు 34వ వన్డే సెంచరీ కావడం విశేషం.

కానీ  బెథెల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుటైన తర్వాత, భారత మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇషాన్ కిషన్ 14 పరుగులు, శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా, కెఎల్ రాహుల్ 12 పరుగులకే వెనుదిరిగారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. భారత్ ఇంగ్లాండ్ కు దీటుగా పోటీ ఇవ్వగలిగిందంటే.. అది రోకో (రోహిత్, కోహ్లీల) పోరాటంతోనే సాధ్యమైంది. టీమ్ ఇండియా బ్యాటర్లలో స్కిప్పర్ శుభమన్ గిల్, రోకో వినా మిగిలిన ఆటగాళ్లంతా ఇటా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమ్ ఇండియా  50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.  

Rohit Sharma Century Lords, India vs England 3rd ODI, Rohit Sharma 138 Runs,  IND vs ENG ODI Series 2026

By
en-us Political News

  
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.