విపత్తులలో లైఫ్ సేవింగ్ మిషన్...రోబో ర్యాట్!

Publish Date:Apr 24, 2022

Advertisement

విపత్తులు ఏర్పడిన సందర్భాలలో ఎందరో నిస్సహాయంగా మరణిస్తున్న సంఘటనలు కలచివేస్తుంటాయి.  ముఖ్యంగా భూ కంపాలు సంభవించినప్పుడు, భవనాలు, వంతెనలు కుప్పకూలిన సందర్భాలలోనూ ప్రాణనష్టం అపారంగా జరుగుతుంటుంది. సహాయం అందక శిథిలాల కింద చిక్కుకుని ఊరిపాడక మరణించే వారి సంఖ్యే ఇటువంటి సందర్భాలలో అధికంగా ఉంటుంది. ఇటువంటి మరణాలను నివారించడం ఎలా అన్న దిశగా సెంటిస్టులకు చేస్తున్న కృషి ఒక కొత్త ఆవిష్కరణకు కారణమైంది.
సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించుకోవడం ద్వారా నిస్సహాయంగా ఎవరూ మరణించే దుస్థితి లేకుండా చేయాలన్న వారి తపన నుంచి పుట్టుకు వచ్చిన కొత్త ఆవిష్కరణే రోబోటిక్ ర్యాట్. మర ఎలుక. 
ఇది విపత్తు సమయాలలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని జాప్యం లేకుండా గుర్తించి సంకేతాలు పంపిస్తుంది. దాంతో అలా చిక్కుకున్న వారిని వెంటనే రక్షించే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. బరువు తేలిక, కదలిక చురుకు అన్న విధంగా దీనిని రూపొందించారు. విపత్తుల సమయాలలో అపార ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ రోబో ఎలుక సేవలు ఎంతైనా ఉపయుక్తంగా ఉంటాయని చెబుతున్నారు. 
ఇప్పటికే రోబో ఎలుక పని తీరుకు సంబంధించి అన్ని పరీక్షలూ పూర్తయ్యాయనీ, విపత్తు సమయాలలో మానవ ప్రాణాలను కాపాడటంలో ఇది అందించే సేవలు అమూల్యమని చెబుతున్నారు. దీని పనితీరుకు సంబంధించిన వివరాలు, విశేషాలను ఐఈఈఈ ట్రాన్సాక్షన్‌ జర్నల్‌లో ప్రచురించారు. త్వరలో ఈ రోబో ఎలుక సేవలు అందుబాటులోకి వచ్చి విపత్తు సమయాలలో ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించడానికి దోహదపడతాయని ఆశిద్దాం.

By
en-us Political News

  
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.