సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ .. పోలీసుల కాల్పులు

Publish Date:Jun 14, 2026

Advertisement

సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ యత్నాన్నిప్రయాణీకుల ధైర్యం, పోలీసు కాల్పులు విఫలం చేశాయి. వివరాలిలా ఉన్నాయి..  చెంగల్పట్టు నుండి కాకినాడ పోర్ట్ వైపు ప్రయాణిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ లక్ష్యంగా  దొంగలు దోపిడీ యత్నం చేశారు.  అర్ధరాత్రిదాటిన తరువాత   ఒంటిగంట సమయంలో   ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి దోచుకోవాలని చూశారు.  బాపట్ల,  అప్పికట్ల స్టేషన్ల మధ్య ఉన్న నల్లమడ వాగు రైల్వే బ్రిడ్జిపైకి రైలు చేరుకోగానీ దుండగులు  ఎస్ 3, ఎస 6 స్లీపర్ కోచ్‌లలోకి చొరబడ్డారు. అక్కడ నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికులపై దాడి చేసి, వారి మెడలోని బంగారు ఆభరణాలను బలవంతంగా తెంచుకున్నారు. అయితే, ఈ హఠాత్పరిణామంతో ఒక మహిళ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు.

ఒక్కసారిగా కోచ్‌లోని ప్రయాణికులంతా లేచి దొంగలను చుట్టుముట్టేందుకు ప్రయత్నించడంతో, తీవ్ర ఆందోళనకు గురైన దుండగులు పట్టుబడతామనే భయంతో వెంటనే రైలు అలారం చైన్‌ను లాగారు. దీంతో రైలు నల్లమడ వాగు బ్రిడ్జిపైనే నిలిచిపోయింది. వెంటనే దొంగలు రైలు నుండి కిందకు దూకి చీకటిని ఆసరాగా చేసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే..  రైల్లో విధుల్లో ఉన్న రైల్వే పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది తక్షణమే స్పందించారు. పారిపోతున్న దొంగలను నిలువరిస్తూ..  లొంగిపోవాలని హెచ్చరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దాలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో దొంగలు ఆభరణాలతో సహా నల్లమడ వాగు పరిసరాల్లోని దట్టమైన చీకట్లోకి పారిపోయారు.

ప్రయాణికులు సమయస్ఫూర్తితో, ధైర్యంతో కేకలు వేయడం వల్లే కోచ్‌లలోని వందలాది మంది ప్రయాణికులు దోపిడీకి గురికాకుండా ప్రాణాలతో పాటు తమ సొత్తును కాపాడుకోగలిగారు. ఈ పెను ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడ లేదు.  పరారీలో ఉన్న నిందితుల కోసం రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి  గాలింపు చర్యలు చేపట్టారు.  

By
en-us Political News

  
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్టేట్మెంట్ నమోదు..
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎపై గెలిచిన భారత్-ఎ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది
ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్ చేసిన వాసుదేవ రెడ్డి, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
ప్రతీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ...
రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో కస్టడీ విచారణ ముమ్మరం...
కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకార సంఘాలకు కీలక సూచనలు చేశారు
క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్‌లకు నోటీసులు పంపిన TCA..
హైదరాబాద్‌ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
జూన్ 17 వచ్చినా దేశంలోని చాలా ప్రాంతాలలో వేసవి వాతావరణమే నెలకొని ఉంది. చురుకుగా కదలాల్సిన నైరుతి రుతుపవనాలు మందగించాయి. సాథారణంగా జూన్ 17 నాటికి దేశ వ్యాప్తంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 39.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.
భారత్ మరియు అఫ్గానిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం సరికొత్త మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.