Publish Date:Jun 27, 2022
ఆడలేక మద్దెలోడు అన్నట్లుంది వైసీపీ తీరు. వైసీపీ హయాంలో ఏపీలో రోడ్లు ధ్వంసం కావడానికి కారణం వర్షాలట. అదే చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో వర్షాలు పడలేదు కనుక రోడ్లు పాడు కాలేదట. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన వైసీపీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించిన మహా రహస్యమిది.
ప్లీనరీలో మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో 95శాతం నెరవేర్చిందని చెప్పారు. అదే చంద్రబాబు హయాంలో అయితే ఇచ్చిన హామీలలో అధిక శాతం హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. పుట్టలో వేలెడితే కుట్టనా అన్నదట చీమ.. అలాగే వర్షాలు పడితే రోడ్లు పాడవ్వవా అంటున్నారు
పెద్ది రెడ్డి. కరోనా కారణంగా గత రెండేళ్లూ ప్లీనరీ జరుపుకోలేకపోయామనీ, ఈ ఏడాది జూలై 8, 9 తేదీలలో వైసీపీ ప్లీనరీ ఘనంగా జరుపుకుంటామని అన్నారు. గడపగడపకూ కార్యక్రమంలో తాను పొల్గనకపోవడంపై విపక్షాలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నాయనీ, తనకు బాధ్యతలు ఎక్కువ కావడం వల్లనే గడపగడపకూ వెళ్లలేకపోయాననీ అన్నారు.
అయినా తాను గడప గడపకూ వెళ్లడమెందుకు.. నేరుగా సమస్యలు తనకు తెలియజేస్తే తక్షణమే వాటిని పరిష్కరిస్తానని పెద్దిరెడ్డి చెప్పారు. గతంలో డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో 95 శాతం హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కాదని.. అందుకే రోడ్లు పాడు అయ్యేవి కాదని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని అందుకే రోడ్లు పాడౌతున్నాయని పెద్దిరెడ్డి వెల్లడించారు. అయినా పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roads-destroyed-because-of-rains-39-138552.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.