ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Publish Date:Jun 29, 2026
Advertisement
ఢిల్లీ, డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లోని పవిత్ర గంగానదిలో స్నానాలు ఆచరించి, అక్కడి దేవాలయాలను దర్శించుకునేందుకు వెడుతున్న తీసింది. హర్యానాలోని బహదూర్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబానికి ఆ ప్రయాణం విషాదాన్ని మిగిల్చింది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై వారు దిగాల్సిన ఎగ్జిట్ రూట్ దాటిపోవడంతో డ్రైవర్ కారును రివర్స్ చేసి ఆ ఎగ్జిట్ రూట్ లో వెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఘోర ప్రమాదానికి దారి తీసింది. ముందుకు వెళ్ళి యూ-టర్న్ తీసుకోవడానికి బదులుగా, అదే హైవేపై కారును వెనక్కి రివర్స్ చేయడం అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక స్కార్పియో ఎస్‌యూవీ వాహనం, ఈ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న 40 ఏళ్ల ప్రవీణ్, ఆయన భార్య 37 ఏళ్ల , ప్రవీణ్ తల్లి సుదేశ్, 9 ఏళ్ల కుమారుడు శివాంశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.
http://www.teluguone.com/news/content/road-accident-on-delhidehradun-expressway-36-224430.html





