నేతల మధ్య సయోధ్య.. శ్రేణుల కీచులాట.. కూటమి పార్టీల్లో వింత ముచ్చట!

Publish Date:Oct 30, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు పార్టీల నేతల మధ్యా సయోధ్య చక్కగా కుదిరింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని నిర్ణయాలలోనూ సమష్టిగా ముందుకు సాగుతోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య సయోధ్యం కుదిరింది. పాలన సజావుగా సాగుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల శ్రేణులు కార్యకర్తల మధ్య మాత్రం ఆటువంటి సయోధ్య కనిపించడం లేదే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. క్యాడర్ బలం అంతగా లేని బీజేపీని పక్కన పెడితే కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య కీచులాటలు మొదలయ్యాయి. సమష్టిగా పని చేయాలని రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమతమ పార్టీ క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలిచ్చానా పరిస్థితిలో మార్పు రావడం లేదు. 

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి నాలుగు నెలలు పూర్తవుతోంది. తొలి రోజుల్లో ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే పరిస్థితులు కనిపించాయి. అయితే ఇటీవలి కాలంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సమష్టి తత్వం కనుమరుగైంది. రాష్ట్రం అంతటా పరిస్థితి ఇలాగే ఉందని కాదు కానీ, పలు చోట్ల ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకటి రెండు చోట్ల ఇది బహిర్గతం అయ్యింది. ఇంకా పలు చోట్ల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.  

తాజాగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన దెందులూరు నియోజ‌వ‌ర్గంలో తెలుగుదేశం  జ‌న‌సేన  కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తెలుగుదేశం నాయకుడు సైదు గోవర్ధన్ ఇటీవల జనసేనానిపై చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి,  రాజ‌కీయ ర‌గ‌డకు దారి తీశాయి. స్థానిక నాయ‌కులు స‌ర్ది చెప్పినా ఫలితం లేకపోయింది.  క్షణమే టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు రెడీ అవుతున్నారు. 

ఇక ఉమ్మడి ఒంగోలు లోనూ తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇటీవల జిల్లాలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేనలోకి వలసలు జరిగాయి. అయితే జనసేనాని కూటమి ధర్మాన్ని విస్మరించి బాలినేనిని  వంటి నేతలను పార్టీలో చేర్చుకోవడాన్ని తెలుగుదేశం శ్రేణులు తప్పుపడుతున్నాయి.   అలాగే అనంతపురం అర్బన్ లో కూడా జనసేన, తలుగు దేశం పార్టీల విభేదాలు  రచ్చకెక్కాయి.  వీటిని చక్కదిద్దుకోకుంటే మున్ముంది మరిన్ని సమస్యలు ఉత్పన్నమవ్వడం ఖాయమన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నది. 
 

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.