Publish Date:Oct 30, 2024
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు పార్టీల నేతల మధ్యా సయోధ్య చక్కగా కుదిరింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని నిర్ణయాలలోనూ సమష్టిగా ముందుకు సాగుతోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య సయోధ్యం కుదిరింది. పాలన సజావుగా సాగుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల శ్రేణులు కార్యకర్తల మధ్య మాత్రం ఆటువంటి సయోధ్య కనిపించడం లేదే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. క్యాడర్ బలం అంతగా లేని బీజేపీని పక్కన పెడితే కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య కీచులాటలు మొదలయ్యాయి. సమష్టిగా పని చేయాలని రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమతమ పార్టీ క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలిచ్చానా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి నాలుగు నెలలు పూర్తవుతోంది. తొలి రోజుల్లో ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే పరిస్థితులు కనిపించాయి. అయితే ఇటీవలి కాలంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సమష్టి తత్వం కనుమరుగైంది. రాష్ట్రం అంతటా పరిస్థితి ఇలాగే ఉందని కాదు కానీ, పలు చోట్ల ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకటి రెండు చోట్ల ఇది బహిర్గతం అయ్యింది. ఇంకా పలు చోట్ల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన దెందులూరు నియోజవర్గంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తెలుగుదేశం నాయకుడు సైదు గోవర్ధన్ ఇటీవల జనసేనానిపై చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి, రాజకీయ రగడకు దారి తీశాయి. స్థానిక నాయకులు సర్ది చెప్పినా ఫలితం లేకపోయింది. క్షణమే టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు రెడీ అవుతున్నారు.
ఇక ఉమ్మడి ఒంగోలు లోనూ తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇటీవల జిల్లాలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేనలోకి వలసలు జరిగాయి. అయితే జనసేనాని కూటమి ధర్మాన్ని విస్మరించి బాలినేనిని వంటి నేతలను పార్టీలో చేర్చుకోవడాన్ని తెలుగుదేశం శ్రేణులు తప్పుపడుతున్నాయి. అలాగే అనంతపురం అర్బన్ లో కూడా జనసేన, తలుగు దేశం పార్టీల విభేదాలు రచ్చకెక్కాయి. వీటిని చక్కదిద్దుకోకుంటే మున్ముంది మరిన్ని సమస్యలు ఉత్పన్నమవ్వడం ఖాయమన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rift-between-tdp-and-janasena-cadre-25-187669.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.