Publish Date:Jun 23, 2022
సంచలనాలు ఆయనను వెతుక్కుంటూ వస్తాయో.. ఆయనే సంచలనాల వెంట పడతారేమో కానీ రాంగోపాల్ వర్మ నోరు తెరిచి ఓ మాట అంటే సంచలనం. ట్వీట్ చేస్తే వివాదం..ఇలా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు రామగోపాలవర్మ అలియాస్ ఆర్జీవీ. ఇప్పుడు ఆయన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మును టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంట్రవర్సీ కామెంట్ ని పోస్ట్ చేశారు . ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ముర్ము చాలా పేద కుటుంబంలో పుట్టిన మనిషి. తన పాతికేళ్ల కెరీర్ లో రాజకీయాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిచే వరకూ ఎదిగారు. ఆదివాసీ మహిళ అయినప్పటికీ ఆమె ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. అందులో సందేహం లేదు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము జూన్ 25 న నామినేషన్ వేయనున్నారు. ఈ ఎలక్షన్స్ లో గెలిస్తే దేశంలోనే అత్యున్నత పదవికి ఎన్నికైన మొదటి ఆదివాసీ గిరిజన మహిళగా ఈమె చరిత్ర సృష్టిస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లను బట్టి రాష్ట్రపతిగా ఆమె ఎన్నిక లాంఛనమే. అటువంటి మహిళపై రామ్ గోపాల్ వర్మ నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణం. ఎంతైనా గర్హనీయం. పురాణ గాధలోని ఓ పేరును తీసుకుని ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడటం శిక్షార్హం కూడా. పైగా గిరిజన మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామగోపాల వర్మపై ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మహిళను గౌరవించడం మన సమాజ ధర్మం. గౌరవించడానికి పేరు, స్థాయితోనూ సంబంధం లేదు. రామగోపాల వర్మ ద్రౌపది ముర్మును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఆర్జీవీ నీచ మనస్థత్వానికి, సంకుచిత ఆలోచనా ధోరణికీ నిదర్వనం. జీవితంలో ఎంతో కష్టపడి దేశంలో ఉన్నత స్థాయికి చేరుకున్న మహిళను ఎకసెక్కం చేయడం.. ఆమె పేరును బట్టి వ్యక్తిత్త హననానికి పాల్పడటం దుర్మార్గం. దారుణం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rgv-ugly-comments-on-draupati-murmu-39-138241.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.