మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అలాంటి వేళ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగన్ బయోపిక్.. వ్యూహాత్మకంగా తెరకెక్కుతోంది.
అయితే ఈ చిత్రంలోని పలు సన్నివేశాలకు చెందిన నాలుగు ఫొటోలను రామగోపాల్ వర్మ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో జగన్‌గా అజ్మల్... ఆయన భార్య భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ఈ ఫొటోల్లో... వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర ఫటంలో.. ఆజ్మల్, మానస రాధాకృష్ణన్ కనిపించీ కనిపించకుండా ఉన్నారు. ఇక రెండో చిత్రంలో అజ్మల్ ఆందోళనతో ఏదో చెబుతుండగా.. అతడి మొఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఆందోళనను భారతీ పాత్రలో మానస రాధాకృష్ణన్ తీవ్ర ఆవేదనతో గమనిస్తున్నట్లుగా ఉంది. ఇక మరో ఫొటోలో అజ్మల్‌కు ఫోన్ రావడం.. మానస.. ఆందోళనతో మంచంపై నుంచి లేచి కూర్చొవడం.. వంటి ఫోటోలు వదిలారు.
అయితే వీరిద్దరు ఇంత ఆందోళనతో ఉండడాన్ని బట్టి చూస్తే.. ఇది వైఎస్ జగన్ చిన్నాన్న వైయస్ వివేక హత్య జరిగిన సమయంలో వచ్చిన ఫొన్ కాల్‌గా నెటిజన్లు భావిస్తున్నారని వారి కామెంట్లను బట్టి అవగతమౌతోంది. మరోవైపు ఈ చిత్రం అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్దం అంటూ క్యాప్షన్ పెట్టారు. మరోవైపు ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్.. బయోపిక్‌లో అబద్దాలు ఉండొచ్చు కానీ.. రియల్ పిక్‌లో వందకి వందశాతం నిజాలే ఉంటాయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం విదితమే. ఇంకోవైపు ఈ చిత్ర షూటింగ్ శరవేగంతో జరుపుకొంటోంది. ఈ చిత్రం ఎన్నికల నాటికి విడుదల చేసి.. లబ్ధి పొందాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం రెండో భాగం తెరకెక్కనుందని.. ఆ చిత్రానికి శపథం పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇక మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి.. అధికారంలోకి రావడంతో.. మహీ వి. రాఘవ దర్శకత్వంలో యాత్ర పేరుతో మమ్ముటి నటించిన చిత్రం 2019 ఎన్నికలకు ముందు విడుదలై.. ఘన విజయం సాధించింది. అలాగే వైయస్ఆర్ మరణం తర్వాత ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ పాదయాత్ర సైతం చేశారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మహీ వి రఘవ దర్శకత్వంలో యాత్ర 2 పేరుతో చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత అమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ చిత్రాన్ని సైతం తెరకెక్కించారు. మరి ఎన్నికల వేళకు ఈ వ్యూహాం చిత్రం పూర్తయి.. ప్రజల ముందుకు వస్తుందా? వస్తే.. జగన్ పాదయాత్రలో నాడు ఇచ్చిన హామీలు.. ఆయన గద్దెనక్కిన తర్వాతా అంటే.. ఈ నాలుగేళ్లలో పుల్ ఫిల్ చేసేశారా? అనేది.. చిత్రం విడుదలై.. ప్రజలు ఎలా రిసివ్ చేసుకొంటారనే ఓ చర్చ జోరుగా సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rgv-political-moovie-vyuham-39-156277.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది