కర్ణాటక ఫలితాల తర్వాత మద్యం కుంభకోణంలో నిందితురాలైన కల్వకుంట్ల కవితపై బిజెపీ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. కర్ణాటక ఫలితాల తర్వాత కవిత అరెస్ట్ ఖాయమని తెలంగాణ బిజెపి నేతలు ప్రచారం చేశారు. ఆమె జైలు గది కూడా సిద్దమైందని ఒక దశలో ప్రచారం చేశారు. కర్ణాటక ఎన్నికలకు ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎటువంటి సంబంధం లేదు. కర్ణాటక ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బిజెపి ఓడిపోయింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని దేవగౌడ అభ్యర్థన మేరకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కెసీఆర్ పాల్గొనాలి. ఢిల్లీ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం కాగానే కెసీఆర్ నేరుగా కర్ణాటక వెళతారని షెడ్యూల్ లో ఉంది. జెడీఎస్ తరపున కెసీఆర్ ఏ ఒక్క బహిరంగ సమావేశంలో పాల్గొనలేదు. బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కూతురు కవితను అరెస్ట్ చేస్తామని బిజెపి బ్లాక్ మెయిల్ చేసిందని తెలంగాణాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. జనతాదళ్ ఎస్ పార్టీకి ఫండ్ ఇస్తానని కెసీఆర్ హామి ఇచ్చినట్లు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ ఎస్ నేత కుమార స్వామి చెప్పారు. ఫండ్ ఇవ్వలేదు కనీసం ప్రచారం కూడా చేయలేదని కుమారస్వామి ఆరోపించారు.
కాగా తెలంగాణలో తమ పార్టీ మూడో పొజీషన్ లో ఉందని తెలంగాణ బిజెపి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఈ బిజెపి నేతలు తెలంగాణలో అధికారంలో వస్తామని, తమకు బిఆర్ఎస్ పోటీ కూడా ఇవ్వలేదని జోస్యం చెప్పారు. అనేక చోట్ల బిఆర్ఎస్ డిపాజిట్లు కూడా రావని చెప్పారు. కవిత అరెస్ట్ అటకెక్కిన తర్వాత తెలంగాణ బిజెపి నేతలు కాంగ్రెస్ , బిఆర్ఎస్ మధ్యే పోటీ ఉండబోతుంది. మేము థర్డ్ పొజిషన్ లో ఉంటామని అంగీకరిస్తున్నారు.
ఇంత పెద్ద భారీ స్కాంలో నిందితురాలైన కవితను కాపాడటానికి కెసీఆర్ చక్రం తిప్పారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
కూతురును సిబిఐ, ఈడీ కేసుల నుంచి విముక్తి చేయడానికి కెసీఆర్ బిజెపితో అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు.
కవిత అరెస్ట్ అయితే తమ పార్టీ గెలుస్తుంది. ఒక వేళ చేయకపోతే తమ పార్టీ ఓడిపోతుందని తెలంగాణ బిజెపి నేతలు బాహాటంగానే స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధం ఉన్నట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న శరత్ రెడ్డి గత సంవత్సరం నవంబర్ లో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రస్తుతం ఆయన అప్రోవర్ గా మారిపోయారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు అతని నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి కెసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. కెసీఆర్ తమ గుప్పిట్లో ఉండే విధంగా బిజెపి ప్రభుత్వం శరత్ రెడ్డి ని అప్రోవర్ గా నియమించిందని ప్రచారం జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavita-arrest-is-drama-39-156275.html
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.