ట్రంప్ టారిఫ్ లపై అమెరికాలో రివోల్ట్.!

Publish Date:Aug 4, 2026

Advertisement

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కు సొంత దేశంలోనే చుక్కెదురైంది. ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది.  డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని పాతిక  రాష్ట్రాల కూటమి ట్రంప్ ప్రభుత్వం  చట్టబద్ధమైన అధికార పరిమితులను దాటి వ్యవహరిస్తోందంటూ.. అమెరికా కోర్ట్ ఆఫ్  ఇంటర్నేషనల్ ట్రేడ్' లో పిటిషన్‌ను దాఖలు చేశాయి. అధ్యక్షుడు తన పరిధికి మించి తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల స్వదేశీ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర విఘాతం కలుగుతుందని రాష్ట్రాలు పిటిషన్ లో పేర్కొన్నాయి.  

ట్రంప్ సర్కార్ భారత్ సహా దాదాపు 60  వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు కొత్త సుంకాలను మోపింది.  భారత్‌పై ప్రారంభంలో ఏకంగా 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ..  వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఆ పన్నును 10 శాతానికి తగ్గించింది. అయితే చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులతో పాటు యుఎస్, మెక్సికో, కెనడా ఉమ్మడి వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే సరుకులకు మాత్రం ఈ నూతన పన్నుల నుండి ప్రత్యేక మినహాయింపుని ఇచ్చింది.

అయితే..  ఈ టారిఫ్ ల వల్ల స్థానిక వ్యాపారాలు, సామాన్య వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని 25 రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీ పన్నులు వేయడం వల్ల అంతిమంగా ఆ భారం అమెరికా పౌరుల జేబులపైనే పడుతుందని, నిత్యావసర ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికా వినియోగదారులపై ఇది మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని, వ్యాపార సంస్థల సరఫరా వ్యవస్థలు  దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం చట్టబద్ధమైన అధికా రాలను దాటి వ్యాపార రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని డెమోక్రటిక్ రాష్ట్రాలు తమ పిటిషన్ లో పేర్కొన్నాయి.    

Trump new tariffs, 25 US states oppose Trump, US Court of International Trade, Telugu One

By
en-us Political News

  
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక వీడియో దాదాపు ఐదు గంటల పాటు అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలను పది రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని మెటా యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది.
కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది. 
యాపిల్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్‌లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది.
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్‌స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్‌టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్‌టాప్ GPU కాంబినేషన్‌తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్‌తో వచ్చిన ఈ పవర్‌ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్‌బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్‌ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్‌వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్‌లో పుట్టి SRH నెట్ బౌలర్‌గా చేసిన బోడుగుమ్ అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల పాటు మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం విధించింది. అబుదాబి టి10 లీగ్‌లో జరిగిన ఈ ఘోర కుంభకోణం వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇవే.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయంతో బుమ్రా దూరం. ఆయన స్థానంలో 104 రంజీ వికెట్ల వీరుడు జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీ ఎంపికై చరిత్ర సృష్టించాడు. టీమిండియా టెస్టు స్క్వాడ్ వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.