వెంకటరెడ్డికి రేవంత్ క్షమాపణ..
Publish Date:Aug 13, 2022
Advertisement
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బేషరతు క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరులో కాంగ్రెస్ నిర్వహించిన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ పరుష వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రేవంత్ స్పందించారు. ఈ మేరకు కోమటిరెడ్డికి బేషరతుగా క్షమాపణ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోను ట్విట్లర్లో పోస్టు చేశారు. అంతే కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాకూర్, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి చుండూరు సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కించపరిచేలా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ గా క్షమాపణులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. హోంగార్డ్ ప్రస్తావన సమా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. మునుగోడులో తన పాదయాత్రకు ముందు ఈ వివాదానికి తెర దించడమే మేలని రేవంత్ భావించినట్లు చెబుతున్నారు. విభేదాలను విడనాడి మునుగోడులో కాంగ్రెస్ విజయానికి సమష్టిగా కృషి చేద్దామని ఆయనీ సందర్భంగా పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/revanth-un-conditional-appology-to-venkatareddy-39-141846.html





