Publish Date:Apr 14, 2026
నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల గొంతును బలంగా వినిపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (ఏప్రిల్ 15) దేశ రాజధాని ఢిల్లీ వెడుతున్నారు. ఈ పర్యటన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం హస్తిన వేదికగా గళమెత్తడినికే అని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
జనాభాకు 50 శాతం, జీఎస్డీపీకి 50 శాతం ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని బలంగా డిమాండ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ విషయంపైనే ఇండియా కూటమి నేతలతో చర్చించనున్నారు. వీలైతే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అంశంపై కూడా ఈ పర్యటనలో ఇండియా కూటమి నేతలతో రేవంత్ చర్చిస్తారు. ఇక పనిలో పనిగా కేంద్ర మంత్రులను కలిసి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల గురించి కూడా చర్చించే అవకాశా లున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-to-delhi-25-217312.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.