కేసీఆర్​ను పరామర్శించిన సీఎం రేవంత్.. మతలబేంటి?

Publish Date:Dec 12, 2023

Advertisement

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కు   తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగి ప్రస్తుతం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   కేసీఆర్ కు ప్రముఖుల నుండి పరామర్శల వెల్లువ కొనసాగుతున్నది.   సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ మళ్ళీ త్వరగా కోలుకుని అసెంబ్లీ అడుగుపెట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన సీఎం ఆసుపత్రి ఎండీ జి.సురేందర్‌ రావు, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు, డాక్టర్‌ జి.దేవందర్‌రావులతో కేసీఆర్‌ ఆరోగ్యంపై చర్చించారు. అక్కడ మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ను సీఎం కలుసుకోగా.. కేటీఆర్‌ భుజం తట్టి రేవంత్‌ ధైర్యం చెప్పారు. ఆసుపత్రి బయట రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  సీఎస్‌ను ఆదేశించాం. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నామని.. మంచి పాలన అందించడానికి ఆయన సలహాలు అవసరం అని అన్నారు.

అయితే సీఎం రేవంత్ కేసీఆర్ ను పరామర్శించడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా బద్ద శత్రువులుగా కనిపించడం.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ పరిణామం కావడంతో రాజకీయ వర్గాలు కూడా ఈ సందర్భాన్ని ఆసక్తిగా పరిశీలించాయి. పరిధి దాటి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఇప్పుడు ఈ పరామర్శను పరిశీలకులు సైతం రకరకాల కోణాలలో విశ్లేషిస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే చర్చ కూడా జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ప్రతి పక్షంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు అడుగు అడుగునా అడ్డంకులు సృష్టించి ఇబ్బంది పెట్టింది. అక్రమ కేసులు పెట్టి వేధించింది. మరి ఇప్పుడు కేసీఆర్ ను ఇలా రేవంత్ రెడ్డి పరామర్శించడాన్ని కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా అర్ధం చేసుకోగలరు? లేదా అసలు ఏదైనా వ్యూహంలో భాగంగానే ఈ పని చేశారా అనే భావనలు చర్చకు వస్తున్నాయి. అసలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ ను కనీసం అభినందించని కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడమేంటని కొందరంటుంటే.. అలా పరామర్శించి కేసీఆర్ అహంకారంపై రేవంత్ దెబ్బ కొట్టారని కొందరంటున్నారు. 

నిజానికి రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిని సమర్ధించేవాళ్లు ఎంత మంది ఉన్నారో.. వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. వీరిలో కాంగ్రెస్ పైన ప్రేమ, రేవంత్ రెడ్డి పైన అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు.  రేవంత్ చేసిన ఈ పని అణగారి పోతున్న రాజకీయ విలువలకు ప్రాణం పోసినట్లుగా కొందరు విశ్లేషిస్తుంటే.. ఇది కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగమే అన్నట్లుగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో ప్రతి క్షణం నిప్పులు చెరిగిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించి సమాజానికి ఏం సందేశమిచ్చారని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలే లెక్కలేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగిన కార్యకర్తలు కొందరు ఇప్పుడు రేవంత్ కేసీఆర్ ను పరామర్శిండాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని జుట్టు పీక్కుంటున్నారు.  కేసీఆర్ ను  పరామర్శించిన రేవంత్ ను సోషల్ మీడియాలో కొందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రాజకీయాలలో విమర్శలతో పాటు విలువలు కూడా ఉండాలని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. అయితే, ఈ విషయంలో  కాంగ్రెస్ ను భుజాల మీద మోసిన కార్యకర్తలు పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు.

రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఏపీ నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డికి రిప్లై ఇచ్చిన రేవంత్.. చంద్రబాబు, లోకేష్ కి రిప్లై ఇవ్వలేదు.  ఇది కూడా ఏదైనా వ్యూహంలో భాగమా అనేది కూడా చర్చ కూడా జరుగుతున్నది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేలా కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకెళ్లింది. అయితే, రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు జరిగే పరిణామాలను ఆయుధంగా తీసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనేలా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఏపీ నేతలతో ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేనేమో రేవంత్ అండ్ కో  తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ నేతలతో ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే తెలంగాణలో మాత్రం రేవంత్ విలువల పేరిట రాజకీయాలలో కొత్త ఒరవడికి  తెరతీస్తున్నట్లే కనిపిస్తుంది. అయితే, మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు వెలికి తీసే విషయంలో మాత్రం రేవంత్ కరుకుగా, కఠినంగా ఉండాలని పరిశీలకులు అంటున్నారు. సామాన్య ప్రజలూ అదే కోరుకుంటున్నారు. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.