Publish Date:Nov 19, 2024
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఈ నెలాఖరులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21 న మరోసారి హైదరాబాద్ రానుంది. వచ్చే నెల అంటే డిసెంబర్ 5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించనుంది. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ అధికారుల విచారణకే పరిమితమైన కమిషన్ ఇక ముందు రాజకీయ నేతల నిర్వాకం పై దృష్టి సారించి వారినీ విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలపై గురిపెట్టింది. అందులో భాగంగానే అధికారంలో ఉండగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేసింది.
కాళేశ్వరం విషయంలో జరిగిన అవకతవకలకు కేసీఆర్, హరీష్ రావులను, ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అక్రమాలకు కేటీఆర్ ను బాధ్యులుగా చట్టం ముందుక నిలబెట్టే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమీషన్ ఈ నెలాఖరులోగా లేదా డిసెంబర్ మొదటి వారంలో మాజీ నీటిపారుదల, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతు అని తెలుస్తోంది. అంతే కాకుండా యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కమిషన్ గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే అప్పట్లో మదన్ బి లోకూర్ కమిషన్ కు విచారణ అర్హతే లేదంటూ కేసీఆర్ లేఖ రాశారు. ఆ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. అయితే సుప్రీం కోర్టు కేసీఆర్ పిటిషన్ ను కొట్టేసింది. ఇప్పుడు ఇక కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ నోటీసులకు కేసీఆర్ స్పందించి విచారణకు హాజరౌతారా అన్నది తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక ఫార్ములా1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ని అరెస్ట్ చేయడం ఖాయమని ముఖ్యమంత్రి, మంత్రులు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ అగ్రనేతలు ముగ్గురికీ ఏక కాలంలోనే చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-sarkar-fix-time-for-brs-top-leaders-39-188638.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది