రేవంత్ స‌ర్కార్ బిగ్‌ ప్లాన్‌.. కేటీఆర్‌కు దిమ్మ‌తిరిగే షాక్ తప్పదా?

Publish Date:Nov 15, 2024

Advertisement

న‌న్ను అరెస్టు చేయండి.. మీకు ద‌మ్ముంటే అరెస్టు చేసి జైలుకు పంపించండి.. జైల్లో మంచిగా యోగా చేస్తా.. స్లిమ్‌గా త‌యార‌వుతా.. ఆ త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తా.. ఇవీ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మ‌ధ్య త‌ర‌చుగా చేస్తున్న వ్యాఖ్య‌లు. ఎంత వీలైతే అంత తొంద‌ర‌గా జైలు కెళ్లాల‌న్న ఉత్సాహం కేటీఆర్‌లో క‌నిపిస్తోంది. ఆయ‌న‌ తీరుతో బీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. ఎవ‌రైనా అరెస్టు అంటే ఎలా త‌ప్పించుకోవాలా అని చూస్తారు. కేటీఆర్ మాత్రం ప‌దేప‌దే న‌న్ను అరెస్టు చేయండి అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తుండ‌టం రాష్ట్ర రాజ‌కీయాల్లో  చ‌ర్చ‌నీయాంగా మారింది.

గ‌త ద‌శాబ్ద‌ కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జైలు జీవితం గ‌డిపి వ‌చ్చిన వారు ముఖ్య‌మంత్రి పీఠాల‌ను అదిరోహిస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం ముఖ్య‌మంత్రి కాక‌ మునుపు జైలు జీవితం గ‌డిపి వ‌చ్చిన‌వారే. దీంతో కేటీఆర్ సైతం అదే ఫార్ములా  ఫాలో కావాల‌ని తొంద‌ర‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఎలాగూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం తనను అరెస్టు చేస్తుంద‌ని భావించిన కేటీఆర్‌, అందుకు రెడీ అయిపోయారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బీఆర్ఎస్ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌పై దృష్టిసారించింది.  ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు హైద‌రాబాద్‌లో ఫార్ములా ఈ- కార్ రేసింగ్ నిర్వ‌హ‌ణ‌లో కేటీఆర్‌పై అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజాగా ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లోనూ కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న విచారణలో  కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే ల‌గ‌చ‌ర్ల‌లో అధికారుల‌పై దాడి జ‌రిగింద‌ని  స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో  మ‌రో వారం రోజుల్లో కేటీఆర్ అరెస్టు కాబోతున్నార‌న్న సంకేతాల‌ను పోలీసులు ఇచ్చేశారు. దీనికితోడు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వ‌హ‌ణ‌లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం నిర్ధారణకు వ‌చ్చింది. ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌ను ఇటీవ‌ల  భేటీ సందర్భంగా సీఎం రేవంత్ గవర్నర్ కు అందజేసినట్లు  తెలిసింది. కేటీఆర్ అరెస్టుకు అనుమ‌తి ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను రేవంత్‌, కాంగ్రెస్ నేత‌లు కోరిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది.

ఈ క్ర‌మంలో రాత్రివేళ‌ల్లో కేటీఆర్ ఇంటివ‌ద్దకు బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీగా చేరుకుంటున్నారు. రాత్రంతా అక్క‌డే ఉంటున్నారు. త‌న అరెస్టు ఖాయ‌మ‌ని భావిస్తున్న కేటీఆర్,  ముందుగానే త‌న‌ను జైలు పంపించేందుకు కుట్ర‌లు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసి సానుభూతి పొందాల‌ని   భావిస్తున్న‌ట్లు  రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించినా రెండుమూడు నెల‌ల్లో బెయిల్ పై బ‌య‌ట‌కు రావ‌చ్చున‌ని కేటీఆర్ భావిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం అదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేటీఆర్ ను జైలుకు పంపిస్తే మ‌హా అంటే ఐదు నెల‌లు జైల్లో ఉంటాడేమో, ఆ త‌రువాత బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌స్తారని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. అయితే  ఒక్క‌సారి జైలుకు వెళితే.. సంవ‌త్స‌రం నుంచి రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు కేటీఆర్ బ‌య‌ట‌కు రాకుండా ఉండేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ-ఫార్ములా కార్ రేసింగ్ కేసు, తాజాగా ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న కేసుల విష‌యంలో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవ‌కాశం ఉంది. వీటిలో ఏ ఒక్క‌ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లినా.. ఆ త‌రువాత వ‌రుస‌గా మ‌రిన్ని కేసులు బ‌నాయించి సుదీర్ఘ‌కాలం కేటీఆర్ జైల్లోనే ఉండేలా కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే కేటీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు పెద్ద అడ్డంకిగా మారుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కేటీఆర్ సుదీర్ఘ‌ కాలం జైల్లో ఉంటే.. కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చినా పూర్తి స్థాయిలో రాజ‌కీయాల‌కు స‌మ‌యం వెచ్చించే ప‌రిస్థితులు ఉండవన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఆనారోగ్య‌ కార‌ణాల దృష్ట్యా గ‌తంలోలా ఇప్పుడు ఆయ‌న‌ రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉండే ప‌రిస్థితి లేద‌ని కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ క‌విత సైతం ఇప్ప‌ట్లో పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యే ప‌రిస్థితి కనిపించడం లేదు. బీఆర్ఎస్ లో ఇక మిగిలింది. హారీష్ రావు. ఒక్క‌సారి హ‌రీష్ రావు చేతుల్లోకి పార్టీ ప‌గ్గాలు వెళితే.. కేటీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్ కు అది పెద్ద అవరోధంగా, అడ్డంకిగా  మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని  కేటీఆర్ వ‌ర్గీయులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్  సుదీర్ఘ‌కాలం జైలుకే ప‌రిమితం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ ప‌క్కా వ్యూహాన్ని అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.