Publish Date:Nov 17, 2024
రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాయుద్ధ నౌక దివంగత గద్దర్ కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి వి. వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. గద్దర్ కుమార్తెకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సముచిత గౌరవం లభించినట్లైంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నెలకు కంట్మోనెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన సంగతి విదితమే. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన లాస్య నందిత విజయం సాధించారు. ఆ తర్వాత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా, కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ వెన్నెలకు టికెట్ ఇవ్వలేదు. ఆ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరిన శ్రీగణేశ్‌కు టికెట్ ఇవ్వగా.. ఆయన విజయం సాధించారు.
అయితే.. గద్దర్ చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణాన్ని సాగించారు. ఈ క్రమంలోనే.. రాహుల్ గాంధీతో, రేవంత్ రెడ్డితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఎన్నికలకు కొద్ది రోజులు ముందే గద్దర్ కన్నుమూయగా.. ఆయన అంత్యక్రియలను కాంగ్రెస్ పార్టీయే దగ్గరుండి జరిపించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గద్దర్ సేవలను, ఆయన పోరాటాన్ని రేవంత్ రెడ్డి ప్రతిసారి స్మరించుకోవటమే కాకుండా, ఆయన గుర్తుగా నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా పేరు మార్చారు. కేవలం గద్దర్ పోరాటాలను స్మరించుకోవటమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులకు కూడా సముచిత స్థానం కల్పించి గౌరవించుకోవాలని భావించిన ప్రభుత్వం, ఇప్పుడు వెన్నెలకు సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‌గా నియమించింది.
తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే జరిగింది. అప్పట్లో ఈ సాంస్కృతిక సారథికి ఛైర్మన్‌గా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌గా ఉండగా.. ఆయకు కేబినెట్ హోదా కల్పించారు. అయితే.. ఇప్పుడు గద్దర్ కుమార్తె వెన్నెలను ఛైర్ పర్సన్‌గా నియమించినప్పటికీ.. ఆమెకు కేబినెట్ హోదా మాత్రం ఇవ్వలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-sarkar-appointed-gaddar-daughter-as-telangana-samskrutika-saradhi-chairperson-39-188533.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.