2600 కోట్ల బియ్యం స్కాం.. సీబీఐ విచార‌ణ‌కు రేవంత్‌ డిమాండ్‌.. గ‌వ‌ర్న‌ర్‌కు రిపోర్ట్‌

Publish Date:Apr 13, 2022

Advertisement

బియ్యం పేరుతో 2600 కోట్ల గోల్‌మాల్ జ‌రిగింద‌ని.. అవ‌క‌త‌వ‌క‌ల‌పై కేంద్రం సీబీఐ విచార‌ణ‌కు ఎందుకు ఆదేశించ‌లేదంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిల‌దీశారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లోనే బియ్యం స్కాం జ‌రిగింద‌ని ఆరోపించారు. "గ‌తేడాది కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు వరికి సంబంధించి నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి వడ్లను మిల్లర్లకు ఇస్తే.. మిల్లర్లు వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సి ఉంది. కానీ మిల్లర్లు 8,34,000 మెట్రిక్‌ టన్నులు బియ్యం సరఫరా చేయలేదని తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఆ బియ్యం విలువ రూ.2,600 కోట్లు ఉంటుంది. ఇంత మొత్తంలో అవకతవకలు జరిగితే కేంద్రం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వకపోతే మిల్లర్ల దగ్గర వడ్లు ఉండాలి. ఎఫ్‌సీఐ అధికారులు మిల్లర్ల ద‌గ్గ‌ర‌ తనిఖీలు చేస్తే.. వారి వద్ద వడ్లు లేవు. అంటే మిల్లర్లు, దళారులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ.2,600 కోట్ల బియ్యాన్ని మాయం చేశారు. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను, రైతులను అడ్డం పెట్టుకొని.. రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు చేస్తున్నారు" అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.  

రైతు సమస్యలు, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పాల్పడుతున్న అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గవర్నర్ త‌మిళిసైకి నివేదిక అందించారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివ‌రించారు. 

"వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌, కోటి ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్‌ వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారు. రైతులు పండించిన పంట కొనకపోవడం వల్ల రైతులకు వేల కోట్ల నష్టం జరిగింది. వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ధాన్యం కుప్పలపై రైతుల గుండె ఆగిపోతుంటే ప్రభుత్వం కనీసం వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ఆలస్యం చేయడంతో దాదాపు 30 శాతం మంది రైతులు పండించిన ధాన్యం దళారులు, మిల్లర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. క్వింటా రూ.1960 కనీస మద్దతు ధరకు కొనాల్సిన ధాన్యాన్ని.. మిల్లర్లు, దళారులు కేవలం రూ.1300కే కొన్నారు. ఇప్పటివరకూ జరిగిన కొనుగోళ్లలో రైతులకు రూ.2వేల కోట్ల మేర నష్టం జరిగింది". అన్నారు రేవంత్‌రెడ్డి.    

"ఏ రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకున్నారో వారి వివరాలు మిల్లర్ల దగ్గరున్నాయి. ఆ రైతులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.600 అదనంగా బోనస్‌ ఇవ్వాలని, ఇప్పించాల్సిందిగా గవర్నర్‌కు నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యంలో చివరి గింజా కొనాలని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. కాంగ్రెస్‌ ఒత్తిడికి లొంగి కేసీఆర్‌ ధాన్యం కొంటామని చెప్పారు. ఇప్పుడు సర్కారు కొనుగోలు చేస్తానని చెప్పిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర రూ.1960కి రైతులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరాం". అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు.  

By
en-us Political News

  
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.