ఓటమికి బాధ్యత నాదే.. కేడర్‌కు రేవంత్ భరోసా..
Publish Date:Nov 2, 2021
Advertisement
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలకు సంపూర్ణ బాధ్యత తనదే అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహ పడవద్దని.. వారికి అండగా ఉంటానని రేవంత్ భరోసా ఇచ్చారు. భవిష్యత్‌లో ఇంకా నిబద్ధతతో, పట్టుదలతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కొట్లాడతా. ప్రజల పక్షాన కొట్లాడే ఓపిక వయసు రెండూ నాకు ఉన్నాయి. ఇవాళ కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్‌లో వారిని నూటికి నూరుశాతం కాపాడుకుంటాం. ఉప ఎన్నిక ఫలితాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి.. భవిష్యత్ కార్యాచరణను నిర్ధారించుకుని ముందుకెళ్తాం అని ప్రకటించారు రేవంత్‌రెడ్డి. ‘‘హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కార్యకర్తలను ఎంతో నిరాశకు గురిచేశాయి. అయినా, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్‌ను నిర్ధారించలేవు, నిర్ణయించలేదు. ఈ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రత్యేక మైన పరిస్థితిల్లో జరిగింది. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించినప్పటికీ బల్మూరి వెంకట్ గ్రామ.. గ్రామం తిరిగి ఓటర్లను కలిశారు. భవిష్యత్‌లో వెంకట్ మంచి నాయకుడు అవుతారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే ఉప్పొంగేది లేదు.. ఓడిపోతే కుంగిపోయేది లేదని అన్నారు రేవంత్‌రెడ్డి. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో భాజపాకు 1673 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఉప ఎన్నికలో ఆ పార్టీ నెగ్గింది. మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. అంత మాత్రాన ఆపార్టీ మూసేసింది లేదు.. మిగతా పార్టీలు 10 అంతస్తుల బంగ్లాలు కట్టింది లేదు. కార్యకర్తలకు అండగా నేనుంటా.. రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించే వరకు పోరాడుదాం’’ అని రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-reaction-on-huzurabad-results-25-125733.html





