కొండాకే టికెట్ క‌న్ఫామ్‌.. కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఖాయం?

Publish Date:Aug 21, 2021

Advertisement

హుజురాబాద్ పోరులో కాంగ్రెస్‌కు కొండంత బ‌లం వ‌చ్చింది. పోటీకి కొండా సురేఖ పేరు దాదాపు క‌న్ఫామ్ అయింది. నేడోరేపో అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది. దామోద‌ర రాజ‌న‌ర్సింహ నేతృత్వంలోని క‌మిటీ కొండా పేరును అధిష్టానానికి పంపించింది. అక్క‌డ గ్రీన్‌సిగ్న‌ల్ ప‌డిన‌ట్టే తెలుస్తోంది. ఇక హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కొండా సురేఖ‌ పేరు వెల్ల‌డించ‌డ‌మే త‌రువాయి. అదే జ‌రిగితే.. ఇటు టీఆర్ఎస్‌.. అటు బీజేపీకి.. ద‌బిడి దిబిడే.

హుజురాబాద్ పోరులో ఇప్పుడు కాంగ్రెస్‌కే అధిక ఆధిక్యం క‌నిపిస్తోంది. హుజురాబాద్ టీఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. కొంద‌రు కారులోనే ఉండిపోగా.. మ‌రికొంద‌రు ఈట‌ల వెంట బీజేపీలో చేరిపోయారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అంతే బ‌లంగా ఉంది. కౌశిక్‌రెడ్డి వెంట వెళ్లింది అతి త‌క్కువ మందే. కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఇప్ప‌టికీ అంతే ప‌దిలంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో హ‌స్తం గుర్తుకు 60వేల‌కు పైగా ఓట్లు ప‌డ్డాయి. ఈట‌ల‌కు ల‌క్ష పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. ఆ లెక్క‌న‌.. ఈట‌ల‌కు వ‌చ్చిన ఆ ల‌క్ష ఓట్లనే ఇప్పుడు టీఆర్ఎస్‌, బీజేపీ పంచుకోవాల్సి ఉంటుంది. అంటే.. గ‌త ఓట్ల శాతం ప్ర‌కారం హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌-బీజేపీ-కాంగ్రెస్‌.. మూడు పార్టీల‌కు సుమారు 50వేల ఓట్లు చొప్పున‌ దాదాపు స‌మాన బ‌లం ఉన్న‌ట్టు తెలుతోంది. ఇప్పుడు హుజురాబాద్ బైపోల్‌లో ఆ ఓట్ల త‌రాజు ఏ పార్టీ వైపు మొగ్గుతుందో వారిదో విజ‌యం. 

కాంగ్రెస్ రేసులోకి రావ‌డంతో.. ఇప్పుడు పార్టీల కంటే అభ్య‌ర్థులే కీల‌కంగా మారారు. మూడు పార్టీల నుంచి ముగ్గురు హేమాహేమీలు రంగంలో ఉన్నారు. ముగ్గురిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థే కాస్త బ‌ల‌హీనం. గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు విద్యార్థి నాయ‌కుడిగా మంచి ఇమేజ్ ఉన్నా.. హుజురాబాద్‌లో ఆయ‌న వెనుక ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేని దుస్థితి. గెల్లు బ‌రిలో ఉన్నా.. కేసీఆరే పోటీలో ఉన్న‌ట్టు ప్ర‌చారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కారు గుర్తును చూసి ఓటు వేయ‌మంటూ వేడుకుంటోంది. అటు, ఈట‌ల‌+బీజేపీ మాత్రం మాంచి జోరు మీదుంది. ఆ జోరుకు ద‌ళిత బంధుతో బ్రేకులు వేయాల‌నేది కేసీఆర్ ఎత్తుగ‌డ‌. అయితే, అది ఆయ‌న‌కే బూమ‌రాంగ్‌గా మారి మిగ‌తా వ‌ర్గాల‌ను దూరం చేసే ప్ర‌మాదం ఏర్ప‌డింది. హుజురాబాద్‌లో ఇంత రాజ‌కీయ డ్రామా న‌డుస్తుండ‌గా.. కాంగ్రెస్‌+రేవంత్‌రెడ్డి+కొండా టీమ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో పొలిటిక‌ల్ ఈక్వేష‌న్స్ అమాంతం మారిపోతున్నాయి. 

హుజురాబాద్‌లో బ‌ల‌మైన ఓటు బ్యాంకున్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి అంద‌రికీ షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇమేజ్ ఆ పార్టీకి బాగా అడ్వాంటేజ్‌. రేవంత్‌రెడ్డిని చూసి ఓట్లేసే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇక‌, తాజాగా హ‌స్తం పార్టీ అభ్య‌ర్థిగా కొండా సురేఖ పేరు ఖ‌రారు కావ‌డం.. కాంగ్రెస్‌కు మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్టైంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో కొండా దంప‌తులు ఫుల్‌స్ట్రాంగ్‌. ఎవ‌రిని ఎలా డీల్ చేయాలో.. కొండా ముర‌ళీకి తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలీద‌నే టాక్ ఉంది. న‌యానో, భ‌యానో.. అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో కొండా ముర‌ళీ త‌ర్వాతే ఎవ‌రైనా అని అంటారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల్లో కొండా ఆధిప‌త్యం ఉంది. ఇటు రేవంత్‌రెడ్డి ఇమేజ్‌.. అటు కొండా ప‌వ‌ర్ తోడైతే.. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు కొండంత బ‌లం ప‌క్కా. 

ఇక‌, కొండా సురేఖ అభ్య‌ర్థిత్వంతో సోష‌ల్ ఇంజ‌నీరింగ్ సైతం అద్భుతంగా ప‌ని చేస్తుంద‌ని అంటున్నారు. హుజురాబాద్‌లో బీసీల సంఖ్యే అధికం. కొండా సురేఖ ప‌ద్మ‌శాలి.. కొండా ముర‌ళీ మున్నూరుకాపు.. ఆ రెండు వ‌ర్గాల ఓట్లు 70వేలకు పైనే ఉన్నాయి. ఆ సంఖ్య ద‌ళిత ఓటు బ్యాంకుకంటే ఎక్కువే. అందుకే ద‌ళిత‌బంధుతో అసూయ‌గా ఉన్న బీసీ వ‌ర్గాలు టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవ‌కాశం లేక‌పోలేదంటున్నారు. ఈట‌ల‌కు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ గట్టిగా ప్ర‌య‌త్నిస్తుండ‌టం.. కారు పార్టీని దెబ్బ‌కొట్టేలా బీజేపీ+ఈట‌ల కాలు దువ్వుతుండ‌టం.. పిల్లి పోరు పిల్లి పోరు మ‌ధ్య‌లో న‌క్క లాభ‌ప‌డిన‌ట్టు.. హుజురాబాద్ గెలుపును కాంగ్రెస్ ఎగ‌రేసుకుపోయినా ఆశ్చ‌ర్యం అవ‌స‌రం లేదంటున్నారు. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డితో హ‌స్తం శ్రేణులు ఉత్సాహంగా ఉండగా.. ఇప్పుడిక కొండా సురేఖ అభ్య‌ర్థిత్వంతో కాంగ్రెస్ జోష్ రెట్టింపు అవుతోంది. ఇక కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని రెండేళ్లుగా ర‌గిలిపోతున్న కొండా దంప‌తులు ఈ ఎన్నిక‌ల్లో త‌మ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డి పోరాడ‌టం ఖాయం. కొండాకు రేవంత్‌రెడ్డి అండాదండా తోడై.. టీఆర్ఎస్‌, బీజేపీల‌కు చుక్కులు చూపించ‌డం కూడా ఖాయం..అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు జగన్ రావొద్దని, జగన్‌తో తమకు అవసరం లేదని, మళ్ళీ ఇంకొకసారి ఈ పెద్ద తిమింగలం అధికారంలోకి రాకూడదని కోరుకున్నారు.. 
రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడం కోసం తప్ప ప్రభుత్వాలకు భూముల విలువ పెంచడం వెనుక మరో ఉద్దేశమేమీ కనిపించడం లేదు. 
సింగపూర్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్​ నుంచి సింగపూర్ వెళ్తున్న  విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్ ఎయిర్​లైన్స్ సంస్థ వెల్లడించింది.
నేను చెప్పింది జరగకపోతే జనం నా ముఖం మీద పేడ కొడతారు. అదే, నేను చెప్పింది జరిగితే ఆ పేడ జగన్ ముఖాన పడుతుంది అన్నారు.
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం మీద అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి.
తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. అయితే, పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణారావు (కృష్ణ‌బాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి ద‌ర్శ‌నం కోసం క్యూక‌డుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భ‌క్తుల తాకిడి పెర‌గడంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నాస‌రే.. శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, విద్య, ప్రణాళిక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సేవలు, స్థానిక సంస్థలు, భూమి & భవనాలు, ఉన్నత విద్య, శిక్షణ & సాంకేతిక విద్య, విజిలెన్స్, సహకార సంఘాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ వంటి అనేక ముఖ్యమైన విభాగాలకు సిసోడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
ఈసారి లోకేష్‌కి 60 వేల ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే, వైసీపీ సానుభూతిపరులు మాత్రం తమ అభ్యర్థి ఆర్కే మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలనాని అంటారు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాదం. తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల, విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసిపి పాత్ర వుంది. వీటన్నింటిపై సిట్ దర్యాప్తు జరుగుతుంది.
కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడానికి ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్ అవకాశం కల్పించిది. తద్వారా ఈడీ ద్వారా కవితకి బర్త్ డే గిఫ్ట్ అందించింది.
ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అంతమొందించే శక్తి సామర్థ్యాలు మొసాద్ కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం! గతంలో ఇజ్రాయెల్ శత్రువులు వివిధ ఘటనల్లో చనిపోయారు. వాళ్లలో ఇరాన్ కు చెందిన అణు పరిశోధకులు కూడా ఉన్నారు. కచ్చితంగా ఫలానా వాళ్లు చంపారనే ఎలాంటి ఆధారాలు లేని రీతిలో వాళ్లు కడతేరిపోయారు. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాద్ దిట్ట!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.