Publish Date:Oct 12, 2018
తెలంగాణ హోం మత్రి నాయిని నర్సింహా రెడ్డి 2014 లో ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు.కానీ కేసీఆర్ నాయిని ని ఎల్బీనగర్ నుంచి పోటీ చేయమని సూచించారట.బాగా డబ్బున్న సుధీర్‌రెడ్డి మీద పోటీ చేయలేనని నాయిని అనటంతో రూ.10 కోట్లు ఇస్తా పోటీ చెయ్యమని కేసీఆర్ అన్నారట.కానీ దానికి నాయిని సుముఖత చూపకపోవటంతో ఎమ్మెల్సీగా చేసి నా కేబినెట్‌లో పదవిస్తానని హామీ ఇచ్చారట.అన్నమాట ప్రకారమే నాయినికి హోమ్ మంత్రి పదవి కట్టబెట్టారు.కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం నాయిని తన అల్లుడుకి ముషీరాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయతిన్స్తున్నారు.శ్రీనివాస రెడ్డి కి టికెట్ విషయంపై చర్చించేందుకు ప్రయత్నిస్తున్న నాయినికి కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకట్లేదట.టికెట్ విషయం పక్కనపెడితే కేసీఆర్ రూ.10 కోట్లు ఇస్తా అన్నారని నాయిని చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది.
నాయిని నర్సింహా రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ సూమోటోగా స్వీకరించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.28 లక్షలుకాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 10 కోట్లు ఇస్తానని చెప్పినట్లు స్వయంగా నాయిని నర్సింహారెడ్డి చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అధికార పార్టీ డబ్బుతో గెలవాలనుకుంటోందని,రూ.25 వేల కోట్లు మేర అక్రమ సంపాదన ఉందని తాము చేస్తున్న ఆరోపణలు నిజమయ్యాయని ద్వజమెత్తారు.నియోజక వర్గానికి రూ. 10 కోట్లు, తన నియోజక వర్గం కొడంగల్‌లో రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు.ప్రతిపక్ష నేతలపై కాకుండా ముఖ్యమంత్రి ఉంటున్న ప్రగతిభవన్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఎంపీ కవిత ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-reddy-fires-on-kcr-for-treating-nayini-narsimha-reddy-as-slave-39-83871.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.