రేవంత్ కు పీసీసీ.. సీనియర్లు జంప్? కొత్త పార్టీ రెడీగా ఉందట!  

Publish Date:Dec 18, 2020

Advertisement

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కొత్త బాస్ ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. పీసీసీ చీఫ్ పై హైకమాండ్ నుంచి ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పీసీసీ రేసులో ఉన్న నేతలు ఢిల్లీ స్ఠాయిలో చివరి వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై టీపీసీసీ పగ్గాలు దాదాపుగా ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ నుంచి ఆయనకు ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు అందాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. టీపీపీసీ చీఫ్ గానే హైదరాబాద్ లో అడుగుపెడతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. 
       

టీపీపీసీ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తే కాంగ్రెస్ నుంచి భారీగా వలసలు ఉంటాయంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా పోరాడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత వీ హనుమంతరావులు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళతారని ప్రచారం జరుగుతోంది. వారంతా ఇప్పటికే ప్లాన్ బీగా పక్క పార్టీ ప్లాట్ ఫామ్ సిద్దం చేసుకున్నారని చెబుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ రేసులో నిలిచిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటారని గాంధీభవన్ వర్గాల టాక్. 
 

కాంగ్రెస్ నేతల వలసల ప్రచారంపైనా ఆ పార్టీలో ఆసక్తికరమైన  చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చాకా.. సీనియర్లు బయటికి వెళ్లినా పార్టీపై పెద్ద ప్రభావం ఉండదనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. పాత తరం నేతలు పోతే యువ నేతలు వస్తారని, పార్టీకి ఇది మరింత బలం అవుతుందని కొందరు చెబుతున్నారు. పార్టీలో యువనేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ చూస్తున్నారని, రేవంత్ రెడ్డితో  ఆ లక్ష్యం నెరవేరుతుందని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ఆయనతో కలిసి పని చేసేందుకు యువ నేతలు ఎంతో ఆసక్తిగా ఉన్నారని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్లు తనకు సహకరించకపోయినా.. పార్టీని బలోపేతం చేస్తాననే ధీమాలో రేవంత్ రెడ్డి ఉన్నారని, హైకమాండ్ కు కూడా ఆయనపై నమ్మకం ఉందని మల్కాజ్ గిరి ఎంపీ వర్గీయులు చెబుతున్నారు. 

 

మరోవైపు రేవంత్ రెడ్డి గురించే మరో ప్రచారం జోరుగా సాగుతోంది. చివరి నిమిషంలో ఏదైనా జరిగి రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకపోతే తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ గా నియమించకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ పేరుతో కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఒక పార్టీ రిజిస్టర్ అయి ఉందట. ఆ పార్టీ వివరాలు, ఎవరూ రిజిస్టర్ చేయించారన్న వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. రేవంత్ రెడ్డి కోసమే ఆపార్టీని రెడీగా ఉంచారని కొందరు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమిస్తే ఆ పార్టీ బయటికి రాదని, ఆయనకు పీసీసీ రాకుంటే మాత్రం కొత్త పార్టీ తెరపైకి వస్తుందని చెబుతున్నారు. ఆ పార్టీనే రేవంత్ రెడ్డి పార్టీ అవుతుందనే చర్చ జరుగుతోంది. 
    

మొత్తానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇస్తే సీనియర్ నేతలు బయటికి వెళ్లడం జరుగుతుందా.. లేక పీసీసీ పదవి రాకుంటే రేవంత్ రెడ్డే కొత్త పార్టీని నడిపిస్తారా అన్నది ఆసక్తిగా మారుతుంది. అందుకే కాంగ్రెస్ లో జరుగుతున్న, జరగబోయే పరిణామాలను ఇతర పార్టీలు గమనిస్తున్నాయి. ఈ సస్పెన్స్ పోవాలంటే ఏఐసీసీ నుంచి టీపీసీసీ చీఫ్ ప్రకటన రావాల్సిందే.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే..

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.