రేవంత్ ఎంట్రీతో కాంగ్రెస్ ఫేట్ మారుతుందా..!
Publish Date:Oct 31, 2017
Advertisement
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇక రేవంత్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీ కూడా ఫుల్ జోష్ లో ఉంది. రేవంత్ రెడ్డి తమ పార్టీలో చేరడంతో పార్టీ రూపురేఖలే మారిపోతాయని కలలు కంటున్నారు నేతలు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టి రెండు రాష్ట్రాలుగా విడగొట్టి ఎక్కడా లేని పాపాన్ని మూట గట్టుకుంది. కనీసం తమకు రాష్ట్రాన్ని ఇచ్చినందుకైనా తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే...అలాంటి పప్పులేమి ఉడకలేదు. ఇక ఏపీలో అయితే ఇప్పుడప్పుడే కాంగ్రెస్ కోలుకోవడం కష్టం. కానీ ఏపీతో పోల్చుకుంటే... తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త బెటర్. కనీసం ప్రతిపక్షంగా అయినా ఉంది. అయితే పేరుకే ప్రతిపక్షంగా ఉంది కానీ... అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేలా కానీ.. గట్టిగా మాట్లాడే నేతలు ఎవ్వరూ లేరు. ఏదో ఉత్తమ్ రెడ్డి ఉన్నా.. అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టి కేసీఆర్ పై నాలుగు విమర్శలు చేసేవారు. అలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీలోకి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ కూడా కేసీఆర్ పైనే నా యుద్దం అని చెబుతూ ఉంటాడు. చెప్పడమే కాదు.. కేసీఆర్ కు ధీటుగా మాట్లాడగలడు. దీంతో రేవంత్ తమ పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి రావడం వల్ల తమకు కొండంత బలం చేకూరిందని ఆనందపడున్నారు. మరి చూద్దాం.. రేవంత్ ఎంట్రీతో కాంగ్రెస్ ఫేట్ మారుతుందో..? లేదో..?
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. రేవంత్ రెడ్డితో పాటు 18 మంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. సీతక్క, వేం నరేందర్ రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాబురావు, జంగయ్య, బిల్యా నాయక్, రమేష్ రెడ్డి, మేడిపల్లి సత్యం, శశికళ, రాజారాం యాదవ్ లను రాహుల్ గాంధీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ కార్యకమంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-39-78562.html





