కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరువు...!
Publish Date:Oct 31, 2017
Advertisement
అసలు రేవంత్ రెడ్డి పార్టీ మారుతాడని కానీ.. కాంగ్రెస్ లో చేరుతాడని కానీ ఎవరైనా ఊహించారా...? 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి తనదైన ముద్రనే వేశాడు. చాలా తక్కువ కాలంలోనే టీడీపీలో ముఖ్యమైన నేతల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇదేదో ఊరికే రేవంత్ రెడ్డికి ఇవ్వలేదులేండి. రేవంత్ కు ఉన్న దూకుడు.. వాగ్దాటి.. ఎవరినైనా ఎదురించి మాట్లాడగలిగిన వ్యక్తి ఇవ్నీ రేవంత్ ను ఆ స్థాయికి చేర్చారు. ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా కేసీఆర్ పై ఒంటరిగానే పోరాటం చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ కు రేవంత్ అంటే కాస్త భయమనే చెప్పొచ్చు. టీడీపీకి నమ్మిన బంటులా ఉండేవాడు.. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి అందరూ వెళుతున్నా.... తాను మాత్రం వెళ్లలేదు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా టీడీపీకి షాకిచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నాడు. ఏదో ఈ మధ్య తాను ఢిల్లీ వెళ్లడం.. రాహుల్ గాంధీని కలిశాడు అన్న వార్తలు రావడం.. దానిపై స్పందించిన రేవంత్ కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటి అనడం అన్ని వ్యాఖ్యలను బట్టి రేవంత్ పార్టీ మార్పుపై సందేహాలు వచ్చాయి తప్పా.. లేకపోతే ఎవ్వరూ ఊహించనైనా లేదు. ఇప్పుడు అలాగే మరో కీలక నేత విషయంలో కూడా ఎవ్వరూ ఊహించని విధంగా వార్తలు వస్తున్నాయి. అతనెవరోకాదు టీఆర్ఎస్ నెంబర్ 2 గా పేరుపొందిన హరీశ్ రావు. ఎప్పుడూ లేనిది హరీశ్ పార్టీ మార్పు ఈ మధ్య తెగ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు సంగతేమో కానీ ఈ మధ్య హరీశ్ రావుకు కేసీఆర్ కు మధ్య ముందున్నట్టుగా సంబంధాలు సరిగ్గా లేవని... తన కొడుకును పైకి తేవడానికి కేసీఆర్ హరీశ్ రావును పక్కన పెడుతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ.. నిప్పులేనిదే పొగ రాదు అన్న సామెత ప్రకారం.. ఏంత కొంత నిజం లేనిదే ఇలాంటి వార్తలు బయటకు రావన్నది రాజకీయ వర్గాల టాక్. మరి రేవంత్ రెడ్డి విషయంలో జరిగినట్టే.. ఏమో హరీశ్ రావు కూడా పార్టీ మారోచ్చేమో ఎవ్వరం చెప్పలేని విషయం. రేవంత్ రెడ్డి అంతటివాడే పార్టీ మారాడు. ఎందుకంటే రాజకీయాలు అంటేనే అలా ఉంటాయి మరీ. ఇక రేవంత్ వెళ్లిపోవడం వల్ల దాదాపు టీటీడీపీ ఖాళీ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే హరీశ్ రావు కు కూడా కేసీఆర్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. పార్టీలో నెంబర్ 2 స్థానం.. అలాంటి వ్యక్తి పార్టీకి దూరమైతే ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పటికే కోదండరాం విషయంలో సగం వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. మరి ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి.. హరీశ్ రావుకు మునుపటి ప్రాధాన్యత ఇస్తేనే అతనికి.. అతని పార్టీకి కూడా మంచిది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
http://www.teluguone.com/news/content/revanth-reddy-39-78555.html





