అభ్యర్ధుల జాబితాతో రేవంత్ ముందస్తుకు రెడీ.. కాంగ్రెస్ లో కలకలం

Publish Date:Jun 16, 2022

Advertisement

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అంటే, అందుకు ఇంకో సంవత్సరం పైగానే సమయముంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి శాసన సభను అర్ధాంతరంగా రద్దు చేసి ముందస్తుకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ అదే బాటలో మరో మారు ముందస్తు ఎన్నికలు వెళతారని, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.  

ముందస్తు తధ్యమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా విశ్వశిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు ప్రధాన ప్రతిపక్ష నాయకులు అందరూ ఎన్నికలకు సిద్దమై పోతున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో,నవంబర్ లేదా డిసెంబర్’లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు  చేస్తారు.. నెక్ట్  ఇయర్  ఏప్రిల్, మే నెలల్లో  జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో  పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ... ఇది నా మాట.. నా మాటే శాసనం..అన్నట్లు ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తపరుస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. 

అదలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొత్తం 119 అసెంబ్లీ  స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసి, జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఇందులో ఎంత  నిజం వుంది, ఎంత లేదు అనే విషయాన్ని పక్కన పెడితే, రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్ధులను ప్రకటిస్తామని, మూడు నెలల ముందుగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని చెపుతూ వస్తున్నారు.

అదే క్రమంలో ఇప్పుడు జాబితా సిద్దం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, అసెంబ్లీ రద్దు కాకుండానే, ముందస్తు ఎన్నికలు ఉహించుకుని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులను ప్రకటిస్తుందా, అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ముందుగా అభ్యర్ధులను ప్రకటించే కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేదు, ఆఖరి నిముషంలో అభ్యర్ధులను ఖరారు చేయడమే కాంగ్రెస్ సంప్రదాయం. హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే సంప్రదాయం పాటించిందని, పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

మరోవంక, పార్టీ టికెట్ ఆశిస్తున్న అనేక మంది నాయకులు, రేవంత్ జాబితాలో తమ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు, పనిలో పనిగా అధిష్టానం పెద్దలకు తమ కోరికను వినిపించేందుకు ఢిల్లీకి క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. అయితే, వీరు నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరట్ ( ఈడీ) విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సాలిడారిటీ తెలిపేందుకే ఢిల్లీ వెళ్ళినట్లు బిల్డప్ ఇస్తున్నా, స్వామి కార్యం స్వకార్యం చక్క బెట్టుకునేందుకే ఢిల్లీ చేరినట్లు తెలుస్తోంది. అక్కడకు చేరిన రాష్ట్ర నాయకులు, ఢిల్లీ పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని  పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

మరో వంక రేవంత్ రెడ్డి జాబితాలో ఆయన తమ అనుకూల వర్గానికి చెందినవారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రేవంత్ రెడ్డి, చేసిన వివాదస్పద, ‘రెడ్డి’ వ్యాఖ్యల నేపధ్యంగాను, పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి ఒక్కడే కుర్చుని జాబితా తయారు చేశారా? కాంగ్రెస్ పార్టీలో ఒంటరి నిర్ణయాలు చెల్లుతాయా  అనేది మరో చర్చగా వినవస్తోంది. అదెలా ఉన్నా, రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల అభ్యర్ధుల జాబితా సిద్ధం చేసింది నిజమైనా కాకున్నా,  సోషల్ మీడియాలో  మాత్రం మొత్తం 119 పేర్లతో జాబితా షికార్లు చేస్తోంది. దీనిపై  వంక వివాదాలూ మొదలయ్యాయి. 

అదలా ఉంటే, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తమ రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు రావచ్చని అంటున్నారు. నిజానికి ఇటీవల హిజాబ్, హలాల్ వివాదాలు పతాక శీర్షికలకు ఎక్కిన సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనతోనే బీజేపీ మత ఉద్రిక్తలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. అంతే కాదు, ముందస్తు అంచనాలతోనే రాహుల్ గాంధీ ఏప్రిల్ లో లిగాయత్ ఓటు బ్యాంక్ టార్గెట్ గా తుముకూరు శ్రీ సిద్ధి గంగ మఠాన్ని సందర్శించారని  వార్తలొచ్చాయి. 
అయితే, అక్కడ  కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ముందస్తు తధ్యం అంటున్నా, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ముఖ్యంత్రులు మాత్రం ముందస్తు లేదు వెనకస్తూ లేదు ... ఐదేళ్ళు అయిన తర్వాత, షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని,అంటున్నారు. అయితే రేవంత్ జాబితా కాంగ్రెస్ పార్టీలో కలకలం అయితే రేపింది.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.