రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. రుణమాఫీ !

Publish Date:Jul 18, 2024

Advertisement

సకల రోగాలకూ మందు జాలిమ్ లోషన్ అన్నట్లుగా.. రాజకీయంగా తాను ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ రైతు రుణమాఫీయే విరుగుడు అని రేవంత్ భావిస్తున్నారు. అందుకే రూ. రెండు లక్షల రుణమాఫీని కటాఫ్ డేట్ కంటే ముందే ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికలలో కూడా చేయనంత ప్రచారం చేస్తున్నారు. గురువారం (జులై 18)న  లక్ష   రూపాయల వరకూ రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి, రైతుల ఖాతాలలో నిధులను జమ చేయడానికి రెడీ అయిపోయారు.

అసలు తొలుత రుణమాఫీకి రేవంత్ పెట్టిన కటాఫ్ డేట్ ఆగస్టు 15.ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు కూడా. అయితే  జులై 18నే రుణమాఫీ నిధులను విడుదల  ప్రారంభించేశారు. రెండు లక్షల రుణమాఫీని మూడు విడతలుగా అందిస్తామని ప్రకటించిన ఆయేన తాను చెప్పిన ఆగస్టు 15 గడువు కంటే ముందే రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగా  లక్ష రూపాయల వరకూ రుణమాఫీని గురువారం (జులై 18) ప్రారంభించారు.  ఇక లక్షన్నర వరకూ ఉన్న రుణాలను ఈ నెలాఖరులోగా, రెండు లక్షల వరకూ ఉన్న రైతు రుణాలను ఆగస్టులో మాఫీ చేస్తామని ప్రకటించారు.

రేవంత్ నిర్ణయంతో ఒక్కసారిగా ఆయన సర్కార్ పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. ఇటీవల  రేవంత్ రెడ్డి  ఇంటా బయటా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాల నుంచే కాకుండా కాంగ్రెస్ లో కూడా ఆయన తీరు పట్ల ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలాగే  బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలాగే  నిరుద్యోగుల ఆందోళన కూడా రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది.  ప్రభుత్వంపై   అసంతృప్తి పెరుగు తోందన్న భావన ఏర్పడుతున్న సమయంలో  రేవంత్ రుణమాఫీ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో విపక్షాల నోళ్లు మూతపడే పరిస్థితి కల్పించారు. లబ్ధిదారులలో కోత విధించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టడానికి ప్రయత్నించినా అప్పటికే రేవంత్ వారిపై పై చేయి సాధించేశారు.  మొత్తంగా రుణమాఫీ పేరుతో రేవంత్  ప్రభుత్వాన్ని ఒకదాని వెనుక ఒకటిగా చుట్టుముడుతున్న సమస్యలను దూరం చేశారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.