సోనమ్ వాంగ్‌చుక్ కు రేవంత్ సంఘీభావం.. నేడో రేపో హస్తినకు పయనం.!

Publish Date:Jul 17, 2026

Advertisement

పర్యావరణ పరిరక్షకుడు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ   రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తోంది. నేడో రేపో  రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  సాగుతున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడానికి తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి  నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరశన చేపట్టారు. ఇలా ఉండగా ఆయన నిరవధిక నిరశన శుక్రవారం (జులై 17) నాటికి 20వ రోజుకు చేరింది. ఇలా ఉండగా  పార్లమెంట్ భవనం  ముట్టడించేందుకు కూడా  సోనమ్ వాంగ్‌చుక్   బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కీలక తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్‌చుక్  మద్దతుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో  ఈ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

ఇప్పటికే ఆప్ అధినేత,  దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసి  మద్దతు  ప్రకటించారు. కేజ్రీవాల్ పర్యటనతో ఈ ఉద్యమానికి   రాజకీయ బలం చేకూరింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తరఫున దక్షిణాదిలో అత్యంత బలమైన నేత  రేవంత్ రెడ్డి స్వయంగా హస్తిన వెళ్లి సోనమ్ వాంగ్‌చుక్  కు, ఆయన పోరాటానికి సంఘీభావం ప్రకటించనుండటంతో..  కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిని ఈ ఉద్యమ వేదికపైకి పంపించడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో రేవంత్ ది బలమైన వాయిస్ అని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన, సోనమ్ వాంగ్‌చుక్‌తో భేటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ పర్యటన ఖరారైందని అంటున్నాయి.    

Telangana CM, Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, TeluguOne 

By
en-us Political News

  
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.