ఏబీవీకి ఊర‌ట మాత్ర‌మే.. పూర్తి న్యాయ‌మేదీ?!

Publish Date:Dec 23, 2024

Advertisement

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  తెలుగుదేశం నేత‌ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించారు. అక్ర‌మ కేసులు పెట్టి వారిని జైళ్ల‌కు  పంపించి తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేశారు. అదే త‌ర‌హాలో కొంద‌రు సీనియ‌ర్ అధికారుల‌ను కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ జాబితాలో ప్ర‌ముఖంగా వినిపించే పేరు మాజీ డీజీ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు. గ‌త  తెలుగుదేశం ప్ర‌భుత్వ  హ‌యాంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేశారని జ‌గ‌న్ క‌క్ష క‌ట్టారు.  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న్ను టార్గెట్ చేశారు. అయితే, ఏబీవీ సైతం ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఐదేళ్లు యూనిఫాం వేసుకోకుండానే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై న్యాయ‌స్థానాల ద్వారా వీరోచిత పోరాటం చేశాడు. ఈ క్ర‌మంలో ఒకానొక ద‌శ‌లో జ‌గ‌న్ రెడ్డి ధ‌న బ‌లం, అధికార బ‌లం ముందు ఏబీవీ నిల‌వ‌లేక పోయాడు. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను సైతం అడ్డగోలుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ధిక్క‌రించింది. ఆయన మళ్లీ పోలీస్ డ్రస్ వేసుకోకుండా  చేయడానికి లాయర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. త‌న కుమారుడి కంపెనీ నుంచి పరికరాల కొనుగోలు చేశారన్న అభియోగంతో ఏబీవీని సస్పెండ్ చేసిన జగన్ సర్కారు.. ఆ అభియోగాల‌ను రుజువు చేయ‌లేక పోయింది. ఒకే కేసులో రెండుసార్లు ఏబీవీని స‌స్పెండ్ చేసి క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. చివరకు క్యాట్‌లో సైతం ఏబీవీపై ఆరోపణలను జ‌గ‌న్ స‌ర్కార్‌ రుజువు చేయలేకపోయింది. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయన రిటైర్‌మెంట్ రోజున పోస్టింగ్ ఇచ్చింది. సుదీర్ఘ‌కాలం త‌రువాత ఉద‌యం పోలీసు డ్ర‌స్ వేసుకొని సాయంత్రం రిటైర్ కావాల్సిన ప‌రిస్థితిని ఏబీ వెంకటేశ్వరరావు ఎదుర్కొన్నారు.

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై జ‌గ‌న్ రెడ్డి క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి వారిద్ద‌రి మ‌ధ్య ఆస్తి త‌గాదాలు లేవు. ఆయ‌న గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇంటెలిజెన్స్  చీఫ్‌గా ప‌నిచేశారు. ఆ స‌మయంలో ఏబీవీ తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించారన్న అపోహతోనే జగన్  ఆయనపై కక్ష పెట్టుకున్నారు. అంద‌రిలా జగన్‌తో స‌ర్దుకుపోయి ఉంటే ఏబీ భవిష్యత్ మరోలా ఉండేదన్నది వైసీపీ నేత‌ల వాద‌న‌. కానీ ఏబీవీ మాత్రం జ‌గ‌న్‌కు త‌లొగ్గ‌కుండా న్యాయ‌స్థానాల ద్వారా సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏబీ వెంటేశ్వ‌ర‌రావుకు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఆయ‌న్ను నియ‌మిస్తార‌ని, ఇక వైసీపీ హ‌యాంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా ప‌నిచేసిన అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అంద‌రూ భావించారు. కానీ, అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్య‌యి. తెలుగుదేశం కోసం జ‌గ‌న్‌కు టార్గెట్ గా మారి ఐదేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఏబీవీకి కూట‌మి ప్ర‌భుత్వం అధికార‌లోకి వ‌చ్చిన త‌రువాత ఆశించిన స్థాయిలో న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న వాద‌న తెలుగుదేశం శ్రేణుల నుంచే వ్య‌క్త‌మ‌వుతున్నది. తాజాగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులనూ ఎత్తివేస్తున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి జగన్‌పై ఐదేళ్లు అలుపెర‌గ‌ని పోరాటం చేసిన పోలీసు పోరాట యోధుడు ఏబీకి ఇది స్వల్ప ఊరట మాత్రమే అని చెప్పాలి. పూర్తి న్యాయం మాత్రం ఇంకా జ‌ర‌గ‌లేద‌ని అంతా భావిస్తున్నారు.

2019లో జ‌గ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలో ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన అధికారుల‌కు చ‌క‌చ‌కా కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించారు. తెలుగుదేశంకుఫేవ‌ర్ గా ఉంటూ వ‌చ్చిన అధికారులు ఐదేళ్ల జ‌గ‌న్ హ‌యాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చి ఆర్నెళ్లు అయినా వారికి ఇప్పటికీ స‌రైన న్యాయం జ‌ర‌గ‌డం లేద‌న్న వాద‌న ఉంది. ఏవీ వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా అదే జాబితాలో ఉన్నారు. ప్రధానంగా ఏసీబీ విచారణను ఉపసంహరించుకునేలా, అడ్వకేట్ జనరల్ చొరవ తీసుకుంటారని చాలామంది భావించారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత గానీ ఆ ఫైలులో కదలిక రాకపోవడమే విచిత్రం. దానికంటే ముందు.. ఏబీవీని రెండోసారి సస్పెండ్ చేసేందుకు కారణమయిన కేసును కూడా ప్ర‌భుత్వం వేగంగా ఉపసంహరించుకుంటుందని పార్టీ నాయకులు అంచనా వేశారు. ఇక్క‌డ మ‌రో విషాదక‌ర విష‌యం ఏమిటంటే.. కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినప్పటికీ ఏబీవీకి న్యాయంగా ప్రభుత్వం నుంచి రావలసిన కోటీ 70 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ రాలేదు. దాని కోసం ఆయన సీఎస్‌కు ఇచ్చిన లేఖ ఏటుపోయిందో మ‌రి..! అంటే.. మంచి ప్రభుత్వంలో అధికారులు ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నారో, ఎంత చురుకుగా పనిచేస్తున్నారో అర్ధమవుతోంది.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అధికారుల బ‌దిలీల్లో ఏబీవీ వెంక‌టేశ్వ‌ర‌రావు కీల‌క పాత్ర పోషిస్తున్నారంటూ ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఎదుర్కోవాల్సి వ‌స్తున్నది. కూట‌మి ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు పూర్తి న్యాయం జ‌ర‌క్క‌పోగా.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ప‌రిస్థితి. ఇదిలాఉంటే.. ఏబీవీపై జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులూ ఉపసంహరించుకున్నట్లు కూట‌మి ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేప‌థ్యంలో అప్పటి విచారాణాధికారి సిసోడియా వ్యవహారశైలి మరోసారి చర్చకు వచ్చింది. ఏబీవీపై విచారణకు జగన్ సర్కారు సిసోడియాను విచారణాధికారిగా నియమించింది. ఆ సంద‌ర్భంలో సిసోడియా ఏబీపై అడ్డగోలుగా నివేదిక ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాతనే సిసోడియాను గవర్నర్ కార్యదర్శిగా నియమించారని తెలుగుదేశం వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే, ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇప్పించిన కారణంగానే సిసోడియాను తప్పించారే తప్ప ఆయనేమీ జగన్ బాధితుడు కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే సిసోడియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారని, ఆయనకే సీఎస్ పదవి దక్కుతుందన్న ప్రచారంపై  సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.

తాజాగా ప్రభుత్వం ఏబీవీపై అన్ని కేసులు ఉపసంహరించుకున్న ఉత్తర్వు పరిశీలిస్తే సిసోడియా నివేదిక డొల్లతనం ఏమిటో స్పష్టమవుతోందని ఐపీఎస్ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. అలాంటి నివేదికలిచ్చిన సిసోడియాను సీఎస్‌గా నియమించి చంద్రబాబు ప్రభుత్వం అప్రతిష్ఠ ఎందుకు కొనితెచ్చుకుంటుందన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.