మోదీ రాజీనామా?.. ప్రధాని మెడకు ఉక్రెయిన్ వైఫల్యం?

Publish Date:Mar 2, 2022

Advertisement

అవును, మోదీని రాజీనామా చేయమంటోంది విపక్షం. నెటిజన్లు సైతం 'రిజైన్ మోదీ' హ్యాష్ టాగ్ తో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిలో భారతీయ విద్యార్థి చనిపోవడంతో ప్రధాని మోదీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేక విమానాలు పంపించి.. వార్ జోన్ లో చిక్కుకుపోయినా వేలాది మంది ఇండియన్స్ ను హుటాహుటినా తరలిస్తున్నా.. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఓ ప్రాణం పోయాక.. ఇన్ని విమర్శలు వచ్చాక.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముందని మండిపడుతున్నారు. ప్రధానిగా మోదీ అనర్హుడని.. రాజీనామా చేయాలంటూ తెగ ట్రోల్స్ నడుస్తున్నాయి. 

ఆపరేషన్ గంగ పేరుతో భారత ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులను వెనక్కి తీసుకొస్తోంది. మంగళవారం ఆరు విమానాలతో 1377 మందిని స్వదేశానికి తరలించింది. ఆ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అయితే.. యుద్ధం ప్రారంభమై వారం గడుస్తుండగా.. ఇప్పుడు నిద్రలేచారా? అంటూ మోదీ సర్కారుపై విమర్శలు వస్తున్నాయి. మిగతా దేశాలు వార్ బెల్ మోగక ముందే.. తమ దేశస్తులను తీసుకెళితే.. మోదీ ప్రభుత్వం మాత్రం ఓ ప్రాణం పోయాక కానీ.. బాధ్యత గుర్తు రాలేదని మండిపడుతున్నారంతా. ఉక్రెయిన్ వార్ అనే కాదు.. గతంలో ఫస్ట్ వేవ్ కరోనా టైమ్ లోనూ మోదీ తన అసమర్థతను ఇలానే చాటుకున్నారని గుర్తి చేస్తున్నారు. 

2020 తొలినాళ్లలో పరిస్థితి విషమించాక గానీ.. దేశంలోకి విదేశీ విమానాల రాకపై నిషేధం విధించలేదు కేంద్రం. అప్పటికే పెద్ద సంఖ్యలో కరోనా బాధితులు భారత్ లో దిగిపోయారు. దేశ నలుమూలలా వైరస్ ను వ్యాపింపజేశారు. ఇక, ముందస్తు ప్రిపరేషన్ లేకుండా లాక్ డౌన్ విధించడం.. వలస కూలీలతో కేంద్రం వ్యవహరించిన తీరు తీవ్ర అబాసు పాలైంది. ఆ తర్వాత వ్యాక్సిన్ విషయంలోనూ ఇలాంటి వైఫల్యమే. ప్రయోగ దశలో కొవిడ్ టీకా తయారీ సంస్థలను ప్రోత్సహించకపోవడం.. ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందజేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కూడా పౌరులకు ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు మోదీ ప్రభుత్వం మొదట్లో తిధి-వారాలు లెక్కపెడుతూ కూర్చొంది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేశాక కానీ.. పౌరులందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి భారతీయులను రప్పించే విధానంలోనూ మోదీ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అనే చర్చ నడుస్తోంది. 

పెద్ద నోట్ల రద్దు, బ్లాక్ మనీ రప్పించడం.. ఇలా అనేక అంశాల్లో మోదీ అపరిపక్వత స్పష్టం అవుతోందని అంటున్నారు. త్రిబుల్ తలాఖ్ రద్దు.. ఆర్టికల్ 370 రద్దు.. సర్జికల్ స్ట్రైక్స్ చేసినంత మాత్రాన గొప్ప ప్రధాని అయిపోరని.. దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులని.. ఆ దేశ ప్రజలకు మోదీ ఏం చేశారో చెప్పాలంటూ.. సోషల్ మీడియాలో పోస్టులపై పోస్టులు పెడుతున్నారు. కరోనా కాలంలో, ఉక్రెయిన్ వార్ లో భారతీయులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన మోదీ.. ప్రధాని పదవిలో ఉండేందుకు యోగ్యుడు కాడంటూ.. రిజైన్ మోదీ అంటూ.. నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. అయితే, ఈ టాపిక్ ను పక్కదారి పట్టించేందుకు.. మోదీని అసలైన హీరోగా ప్రొజెక్ట్ చేసేందుకు.. మరో దేశభక్తి పాయింట్ కోసం వెతుకుతోంది కమలం పార్టీ. ఇక ఎప్పటిలానే.. భారత్ మాతాకీ జై.. మోదీకీ జైజై.. అని త్వరలోనే జనాలతో అనిపించే ఎత్తుగడ వేస్తోంది కమలదళం. 

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.