తీహార్ జైలు నుంచి కండిషన్ బెయిల్ మీద విడుదలైన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో మారు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో తన పర్యటనలు అట్టర్ ప్లాప్ కావడంతో తాజాగా బీసీ నినాదం ఎత్తుకున్నారు. బతుకమ్మ ఈవెంట్ టార్గెట్ గా ఏర్పాటైన జాగృతి సంస్థ ఇపుడు బిసీ నినాదాన్ని ఎత్తుకుంది. శుక్రవారం సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్బంగా బిఆర్ఎస్ పిలుపునిచ్చిన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బిసీలు గుర్తుకురాని కవిత సడెన్ గా బిసీ నినాదాన్ని ఎత్తుకున్నారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన బిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా లేదు. ఈ ఎన్నికలను వాయిదావేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనాభాలో సగభాగం ఉన్న బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఏమిటని ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని కాంగ్రెస్ పార్టీ మర్చిందని గుర్తు చేయడానికి స్థానికసంస్థల ఎన్నికల వేళ బిసీజెండాను ఎత్తుకుంది. బతుకమ్మ వేడుకలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జాగృతి సంస్థ బతుకమ్మ వేడుకలను పూర్తిగా గాలికొదిలేసింది. కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారని అందరూ ఊహించారు. కానీ ఆ ఊసే లెకుండా బతుకమ్మ సంబరాలను స్కిప్ చేశారు.
ఇపుడు తాజాగా బీసీ డెడికేషన్ కమీషన్ నివేదిక ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కవిత కొత్త రాగం అందుకున్నారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు జరగడానికి వీల్లేదని కవిత హుంకరిస్తున్నారు. అప్పట్లో లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నప్పుడు కూడా కవిత ఇదే విధంగా బిజెపితో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడిపారు. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేయడం తెలంగాణ ప్రజానీకానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కోర్టు ట్రయల్స్ కు హాజరైన సమయంలో కూడా కవిత జై తెలంగాణా నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ వ్యాఖ్యల పట్ల న్యాయస్థానం కవితకు అక్షింతలు వేసింది . తెలంగాణ ఉద్యమానికి లిక్కర్ స్కాంకు ఉన్న సంబంధం ఏమిటో కవితనే సమాధానమిస్తే బాగుంటుంది. తెలంగాణా రాజకీయాల్లో మోస్ట్ వపర్ ఫుల్ పొలిటిషన్ అయిన కవిత కామెడీ స్టార్ గా మిగిలిపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reservation-should-be-implemented-for-bcskavita-new-tune-39-190709.html
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్‌గా వీ నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా ఉన్న సోమనాథ్ పదవీ కాలం సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం జరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (జనవరి 8)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు.
విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
వైసీపీ హయాంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీగుడ్డు నేమ్ సంపాదించుకున్నగుడివాడ అమర్నాథ్ అప్పట్లో చెప్పిన గుడ్డు కథనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జగన్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్.
తెలంగాణలో బిజెపి కార్యాలయంపై కాంగ్రేస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ మంగళవారం బిజెపి శ్రేణులు గాంధీభవన్ వైపు దూసుకొచ్చాయి. ఈ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు
మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిలు కోసం నందిగం సురేష్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు మంగళవారం (జనవరి 7) కొట్టివేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ గడువు ఈ నెల 23తో ముగియనుంది. మొత్తం 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ వరుసగా రెండు పర్యాయాలు ఆప్ అధికారంలో వచ్చింది.
ఒక వైపు ఏసీబీ, మరో వైపు ఈడీ, ఇంకో వైపు తెలంగాణ సర్కార్ ఇలా కేటీఆర్ పై ముప్పేట దాడి చేస్తూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కనీసం అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన విజ్ణప్తినీ తిరస్కరించింది.
ప్రధాని నరేంద్రమోడీ రేపు అంటే బుధవారం విశాఖపట్నం రానున్నారు. పూడి మడకవద్ద ఎన్ టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు ఎనిమిదో తేదీ సాయంత్రం శంకు స్థాపన చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది
బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ గురువారం అంటే జనవరి 9న అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మూలా ఈ కార్ కేసులో ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడమే కాకుండా, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా కుదరదని స్పష్టం చేయడంతో ఆయనకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి.
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కెటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో నందినగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం ఊపందుకుంది.
తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం సులభ తరం చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ఈ నెల 10 నుంచి 19 వరకూ భక్తులకు వైకుంఠద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందు కోసం ఈ నెల 9 నుంచి తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో నిండా మునిగారా అంటే న్యాయ నిపుణులు ఔననే అంటున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను కోర్టు మంగళవారం (జవవరి 7) కొట్టి వేసింది.