ఆర్టీసి బస్సులో రేణుకా చౌదరి  ఉచిత ప్రయాణం 

Publish Date:Dec 11, 2023

Advertisement

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి  ఆర్టీసి బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు రోజుల క్రితం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని మహిళలకు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని ఆమె మహిళలకు వివరించారు.  ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు రోజులు కాకముందే విమర్శలు మొదలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. ఉచితాలు ప్రజల సంక్షేమం కోసమని, దాని వల్ల సోమరిపోతులు అవ్వడం ఉండదన్నారు.
మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అసెంబ్లీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, బాక్సర్ నిఖత్ జరీన్ ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలోని మహిళలందరూ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులో మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. సిటీలో అయితే ఆర్డినరీ, మెట్రో బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.ఉచితంగా ప్రయాణించేందుకు బస్సులలో మహిళలకు సున్నా ధరతో టికెట్ ఇస్తారు. వీటికి అయ్యే ఖర్చును ఆర్టీసీకి ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ చేస్తుంది. ఈ స్కీమ్ అమలుకు రోజుకు రూ. 7 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. రద్దీ ఎక్కువగా అయితే బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని ఆర్టీసీ  ఇప్పటికే స్పష్టం చేసింది.
ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం ఆరు పథకాలను కాంగ్రెస్ పొందుపరిచింది. వాటిలో ఒకటి మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీసు పథకం. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేయడం గమనార్హం. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.